దారి లేని ఊరు..దిక్కుతోచని స్థితిలో చర్లపల్లి గ్రామస్తులు

by Aamani |
దారి లేని ఊరు..దిక్కుతోచని స్థితిలో చర్లపల్లి గ్రామస్తులు
X

దిశ,శంకరపట్నం : శంకరపట్నం మండలంలోని కేశవపట్నం గ్రామపంచాయతీ పరిధిలో గల చర్లపల్లి గ్రామ ప్రజల గుండెలను పిండేసే గాధ ఇది. వివరాల్లోకి వెళితే వరుసగా కురుస్తున్న వర్షాలతో కేశవపట్నం గ్రామము నుండి చర్ల పల్లెకు వెళ్లే దారిలో ఎప్పుడో ఏర్పాటు చేసిన లో లెవెల్ బ్రిడ్జ్ వర్షపు నీరు కు మునిగిపోవడంతో చర్లపల్లి గ్రామానికి రాకపోకలు నిలిచిపోయాయి. దీంతో గ్రామస్తులు తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తూ కల్వర్టు వద్ద నిరసనకు దిగారు.

ఈ సందర్భంగా గ్రామ ప్రజలు మాట్లాడుతూ ఏ చిన్న అవసరానికైనా కేశవపట్నం రావాల్సిన ఉంటుందని వర్షం పడితే గ్రామ ప్రజల పరిస్థితి వర్ణనాతీతం అని జోరుగా వర్షాలు పడిన ప్రతిసారి ఉధృతంగా వాగు ప్రవహించడంతో లో లెవెల్ బ్రిడ్జ్ మునిగి రాకపోకలు నిలిచిపోతున్నాయి. ఏదైనా అత్యవసర పరిస్థితి తలెత్తితే దేవుడిపైనే భారం వేసే పరిస్థితి అని మండల కేంద్రానికి చేరుకోవాలంటే కాకతీయ కాలువ నుండి కరీంపేట గ్రామ శివారు నుంచి మండల కేంద్రానికి చేరుకోవాలని కానీ ఆ కాలువ వెంబడి గల దారి కూడా గుంతలతో బురదతో నిండి ఉండడం వల్ల ద్విచక్ర వాహన దారులు పడిపోయి ప్రమాదాలు జరిగిన రోజులు ఉన్నాయని తారు రోడ్డు ఎక్కాలంటే చుట్టుపక్కల మూడు నాలుగు కిలోమీటర్లు మట్టి రోడ్డులో బురదలో ప్రయాణించాల్సిందే. కేంద్రంలో రాష్ట్రంలో మా ప్రభుత్వలే అని గొప్పలు చెప్పుకునే నాయకులు గ్రామ ప్రజల కష్టాలను పట్టించుకోవడం లేదని కనీసం లో లెవెల్ వంతెనను బ్రిడ్జి గా మార్చే అవకాశం కూడా లేదా అని గ్రామస్తులు ప్రశ్నిస్తున్నారు.

Advertisement

Next Story