ఒకే గ్రామం నుంచి ప్రజావాణిలో ఫిర్యాదుల వెల్లువ

by Shiva |
ఒకే గ్రామం నుంచి ప్రజావాణిలో ఫిర్యాదుల వెల్లువ
X

అక్రమ లేఅవుట్లు, అనుమతిపైనే ఫిర్యాదులు

గోపాల్ రావుపేట సర్పంచ్ భర్తపై కలెక్టర్ కు ఫిర్యాదు

దిశ, రామడుగు : ఒకే గ్రామం నుంచి ఒకే రోజు ఫిర్యాదులు కొప్పలుతెప్పలుగా రావడంతో ఒక్క సారిగా జిల్లా అధికార యంత్రాంగం ఆ గ్రామం వైపు చూస్తోంది. ఇంతకీ ఆ గ్రామంలో ఏం జరుగుతోందని అని కలెక్టర్ ఛాంబర్ నుంచి కింది స్థాయి అధికారుల వరకు ఒక్కటే చర్చ. రామడుగు మండలంలోని గోపాల్ రావు పేట గ్రామం నుంచి కలెక్టరేట్ లో జరిగే ప్రజావాణిలో ఏకంగా 14 మంది ఫిర్యాదు చేసినట్లు సమాచారం. దీనిపై ఫిర్యాదుదారుల వివరణ కోరగా గ్రామంలో సర్పంచ్ భర్త అక్రమాలకు పాల్పడుతూ అక్రమ లేఅవుట్లు, అనుమతులు ఇస్తున్నారని తెలిపారు.

ఇదే విషయంలో కింది స్థాయి అధికారులకు ఫిర్యాదు చేసిన పట్టించుకున్న పాపాన పోలేదని.. చివరికి చేసేదేమి లేక కలెక్టరేట్ లో ఆ గ్రామస్థులు ప్రజావాణిలో తమ గోడును వెళ్లబోసుకున్నారు. ఒకే గ్రామం నుంచి అన్ని ఫిర్యాదులు రావడంతో ఈ విషయంలో కలెక్టర్ కూడా ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. మరి దీనిపై ఉన్నత అధికారులు ఎలాంటి చర్యలు తీసుకుంటారు వేచి చూడాలి మరి.

Advertisement

Next Story