మాస్ కాపీయింగ్ కు పాల్పడితే కఠిన చర్యలు

by Kalyani |
మాస్ కాపీయింగ్ కు పాల్పడితే  కఠిన చర్యలు
X

దిశ ఆమనగల్లు::- పది పరీక్షలను పకడ్బందీగా నిర్వహించాలని, ఎవరైనా మాస్ కాపీయింగ్ కు పాల్పడిన, ప్రోత్సహించిన కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా విద్యాధికారి సుసింధర్ రావు హెచ్చరించారు. శనివారం ఆమనగల్ పట్టణ కేంద్రంలో జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాల, బాలుర ఉన్నత పాఠశాల పది పరీక్ష కేంద్రాలను ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా విద్యార్థులకు కల్పించిన ఏర్పాట్లను అడిగి తెలుసుకున్నారు. ప్రశాంత వాతావరణంలో పరీక్షలను నిర్వహించాలని అధికారులకు సూచించారు. పది పరీక్ష కేంద్రాల పరిసర ప్రాంతాల్లో గట్టి పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. పరీక్షా సమయంలో జిరాక్స్ కేంద్రాల్లో మూసి ఉంచాలని ఆయన పేర్కొన్నారు.

Next Story