- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
సంక్షేమ ఫలాలు పేదలకు చేరేందుకే సమగ్ర కుటుంబ సర్వే.. అడ్లూరి లక్ష్మణ్ కుమార్
దిశ, వెల్గటూర్ : ప్రభుత్వం అందించే సంక్షేమ పథకాలను అసలైన నిరుపేదలకు చేర్చేందుకే సమగ్ర కుటుంబ సర్వేను చేపట్టిందని దీనికి ప్రజలంతా సహకరించాలని ప్రభుత్వ విప్పు అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అన్నారు. ధర్మపురి మున్సిపల్ కార్యాలయం వద్ద బుధవారం ఏర్పాటు చేసిన సమగ్ర కుటుంబ సర్వే ప్రారంభోత్సవ కార్యక్రమంలో ప్రభుత్వ విప్, ధర్మపురి శాసన సభ్యులు అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. ప్రభుత్వం అందించే సంక్షేమ పథకాలు అసలైన పేదలకు చేరకుండా దుర్వినియోగం అవుతున్నాయని, సమగ్ర కుటుంబ సర్వేకు శ్రీకారం చుట్టామన్నారు. రాష్ట్రంలో ఎంత మంది పేదలు ఉన్నారు, ఎంత మందికి ప్రభుత్వ సంక్షేమ ఫలాలు అందుతున్నాయి, ఇంకా ఎంత మందికి అందాల్సి ఉంది, అనర్హులు ఎవరైనా ఉన్నారా అనే విషయాలను తెలుసుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వం సమగ్ర కుటుంబ సర్వేను నిర్వహిస్తామన్నారు.
సర్వే కోసం మీ ఇంటికి వచ్చే అధికారులు అడిగిన ఆధారాలు ఇచ్చి సహకరించాలని ప్రజలకు సూచించారు. ఈ సర్వేలో ఒక కుటుంబానికి సంబంధించిన పూర్తి వివరాలను అధికారులు సేకరిస్తారని, దాని వల్ల ప్రభుత్వం నుండి వచ్చే సంక్షేమ పథకాలు అర్హత ఉన్నవారు మాత్రమే పొందే అవకాశం ఉంటుందన్నారు. అధికారులు కూడా ప్రజల నుండి కచ్చితమైన వివరాలను సేకరించాలని, ప్రజలు కూడా అధికారులకు సహకరించి వివరాలు అందించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ సంగి సత్యమ్మ, కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు దినేష్, అధికారులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.