Kiran Abbavaram: ‘ఆ గ్రామంలో పాములు ఇళ్లలోకే వస్తాయి’.. కిరణ్ అబ్బవరం షాకింగ్ కామెంట్స్

by Anjali |
Kiran Abbavaram: ‘ఆ గ్రామంలో పాములు ఇళ్లలోకే వస్తాయి’.. కిరణ్ అబ్బవరం షాకింగ్ కామెంట్స్
X

దిశ, వెబ్‌డెస్క్: ‘క’ (Ka) సినిమాతో ప్రేక్షకుల ముందుకొచ్చి.. పాజిటివ్ టాక్ సొంతం చేసుకుంటున్నాడు హీరో కిరణ్ అబ్బవరం(Kiran Abbavaram). దీపావళి(Diwali) కానుకగా ఈ మూవీ అక్టోబరు 31 వ తేదీన విడుదలై భారీ వసూళ్లు కొల్లగొడుతోంది. ఈ హీరో నటించిన మొదటి పాన్ ఇండియా చిత్రమని చెప్పుకోవచ్చు. సుజీత్(Sujeet) అండ్ సందీప్(Sandeep) దర్శకత్వం వహించిన ఈ మూవీలో నయన్ సారిక(Nayan Sarika) కథానాయికగా నటించి.. తెలుగు ప్రేక్షకుల్ని మెప్పించింది. అయితే సినిమా సక్సెస్ అనంతరం కిరణ్ అబ్బవరం వరుస ఇంటర్వ్యూలు ఇస్తున్నాడు. రీసెంట్ ఇంటర్వ్యూలో ఈ హీరో క మూవీ షూటింగ్ సమయంలో ఎదుర్కొన్న సంఘటనల గురించి మాట్లాడాడు. అగుంబే అనే ఓ గ్రామానికి షూటింగ్ మీద వెళ్లామని అన్నాడు. ఆ ఊరు పాములకు ఫేమస్ అయినదని అన్నాడు.

మూవీ షూటింగ్ లో చాలాటైడ్ అయి ఓ చెట్టు కింద పడుకుందామని వెళ్లానని అన్నాడు. 15 నిమిషాలు పడుకున్నానని, లేచిన తర్వాత నా పక్క నుంచి పాము వెళ్లిందని మా టీమ్ వాళ్లు చెప్పారని తెలిపాడు. దీంతో చాలా భయమేసిందని, పాములంటే చాలా భయమమని వెల్లడించాడు. ఇక అప్పటి నుంచి చాలా జాగ్రత్తగా ఉంటున్నానని.. షూటింగ్ టైంలో ఎక్కడికి వెళ్లినా లైట్ వేసుకుని మరీ వెళ్లేవాడినని పేర్కొన్నాడు. అలాగే పాములు(snakes) ఆ ఊర్లో ఎప్పుడు తిరుగుతాయని.. ఇంట్లోకి వచ్చి ఉంటాయని ఆ గ్రామ ప్రజలు చెప్పారని తెలిపాడు కిరణ్ అబ్బవరం. అంతేకాకుండా అక్కడికి రియల్ సింహాలు, పులులు కూడా వస్తుంటాయని అన్నాడు. కాగా అలాంటి ప్లేస్ లో షూటింగ్ చేయడానికి భయమేసిందని కిరణ్ అబ్బవరం చెప్పుకొచ్చాడు.

Advertisement

Next Story

Most Viewed