Kammam: మున్నేరు రిటైనింగ్ వాల్ నిర్మాణ ప‌నుల‌పై స‌మీక్ష.. పొంగులేటి కీలక ఆదేశాలు

by Ramesh Goud |
Kammam: మున్నేరు రిటైనింగ్ వాల్ నిర్మాణ ప‌నుల‌పై స‌మీక్ష.. పొంగులేటి కీలక ఆదేశాలు
X

దిశ, వెబ్ డెస్క్: వ‌ర‌ద ముంపు నుంచి ఖ‌మ్మం(Kammam) ప్ర‌జ‌ల‌కు శాశ్వ‌తంగా విముక్తి క‌ల్పించేందుకు చేప‌ట్టిన మున్నేరు రిటైనింగ్ వాల్(Munneru Retaining Wall) నిర్మాణం ప‌నుల‌ను యుద్ధ‌ప్రాతిప‌దిక‌న పూర్తిచేయాల‌ని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీ‌నివాస‌రెడ్డి(Minister Ponguleti Srinivas Reddy), నీటిపారుద‌ల శాఖ మంత్రి ఉత్త‌మ్ కుమార్ రెడ్డి(Minister Uttam Kumar Reddy) అధికారుల‌ను ఆదేశించారు. మంగ‌ళ‌వారం స‌చివాల‌యంలో రిటైనింగ్ వాల్ ప‌నుల పురోగ‌తిపై ఇరిగేష‌న్ అధికారుల‌తో(Irrigation Officers) స‌మీక్ష(Review) నిర్వహించారు. ఈ స‌మావేశంలో ఇరిగేష‌న్ ప్రిన్సిపల్ సెక్ర‌ట‌రీ రాహుల్ బొజ్జా(Rahul Bojja), స్పెష‌ల్ సెక్ర‌ట‌రీ ప్ర‌శాంత్ జీవ‌న్ పాటిల్‌(Prashanth Jeevan Patil), ఈఎన్‌సీ అనిల్ కుమార్(ENC Anil Kumar) త‌దిత‌రులు పాల్గొన్నారు.

ఈ స‌మావేశంలో మంత్రి పొంగులేటి మాట్లాడుతూ.. మున్నేరు ముంపు నుంచి ఖ‌మ్మం ప‌ట్ట‌ణాన్ని కాపాడేందుకు న‌దికి ఇరువైపులా ఆర్‌సీసీ కాంక్రీట్ గోడ‌లు(RCC walls) నిర్మిస్తున్నామ‌ని, ఖ‌మ్మం న‌గరంలో ముంపున‌కు అవ‌కాశం లేకుండా స‌రైన మార్గంలో వ‌ర‌ద ప్ర‌వాహాన్ని న‌డిపించేందుకు స‌రైన డిజైన్ తో వాల్ నిర్మించాల‌ని అధికారుల‌కు సూచించారు. వాల్ నిర్మాణ‌ప‌నులు మ‌రింత వేగం పెర‌గాల‌ని , నెల‌లో రెండు సార్లు స్వ‌యంగా తానే ప‌ర్య‌వేక్షిస్తాన‌ని అన్నారు. ఈ వాల్ నిర్మాణానికి అవ‌స‌ర‌మ‌య్యే భూ సేక‌ర‌ణ‌ను చేప‌ట్టాల‌ని ఇందుకు సంబంధించి రెండు, మూడు రోజుల్లో ఖ‌మ్మం జిల్లాలోని అధికారుల‌తో స‌మీక్ష నిర్వ‌హిస్తాన‌ని తెలిపారు. వాల్ నిర్మాణానికి ఎలాంటి స‌మస్య‌లు ఎదురైనా త‌న దృష్టికి తీసుకురావాల‌ని అధికారుల‌కు సూచించారు. 1969 నుంచి 2024 సెప్టెంబ‌ర్ వ‌ర‌కు వ‌చ్చిన వ‌ర‌ద‌ల‌ను దృష్టిలో పెట్టుకొని వాల్ నిర్మించాల‌ని అన్నారు. ఖ‌మ్మం, పాలేరు అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గాల ప్ర‌జ‌ల‌కు సౌక‌ర్యం క‌ల్పించేలా సుమారు 23 కిలోమీట‌ర్ల మేర వాల్ నిర్మిస్తున్నట్లు మంత్రి స్పష్టం చేశారు.

Advertisement

Next Story

Most Viewed