- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
కామారెడ్డి మాస్టర్ ప్లాన్ ఆందోళన : విలీన గ్రామాల కౌన్సిలర్లలో టెన్షన్
దిశ, వెబ్ డెస్క్: కామారెడ్డి మాస్టర్ ప్లాన్ రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ గత కొన్ని రోజులుగా విలీన గ్రామాల రైతులు ఆందోళన బాట పట్టిన విషయం తెలిసిందే. అయితే రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తమ ఆందోళనలను తీసుకెళ్లడంలో భాగంగా విలీన గ్రామాల కౌన్సిలర్లు రాజీనామా చేయాలని రైతు జేఏసీ నిర్ణయించింది. ఈ మేరకు గురువారం వరకు కౌన్సిలర్లకు డెడ్ లైన్ పెట్టింది.
కాగా నేటితో కౌన్సిలర్ల రాజీనామా డెడ్ లైన్ గడువు ముగియనుంది. దీంతో అధికార పార్టీ కౌన్సిలర్లు అయోమయంలో పడ్డారు. కాగా మాస్టర్ ప్లాన్‌ను వ్యతిరేకిస్తూ ఇప్పటికే ఇద్దరు బీజేపీ కౌన్సిలర్లు రాజీనామా చేశారు. ఇంకా ఏడుగురు కౌన్సిలర్లు రాజీనామా చేయలేదు. అయితే మాస్టర్ ప్లాన్ ను రద్దు చేయాలని రైతు జేఏసీ మొదటి నుంచి డిమాండ్ చేస్తూ వస్తోంది. మిగిలిన ఆరు గ్రామాల కౌన్సిలర్లు ఈ నెల 19(గురువారం)లోగా రాజీనామా చేయాలని రైతు జేఏసీ నాయకులు తీర్మానించారు.
కౌన్సిలర్లు రాజీనామా చేయకపోతే వారి ఇళ్లు ముట్టడిస్తామని రైతు జేఏసీ ప్రకటించిన విషయం తెలిసిందే. శుక్రవారం లోగా మున్సిపల్ కౌన్సిల్ సమావేశం ఏర్పాటు చేసి మాస్టర్ ప్లాన్ రద్దు చేస్తున్నట్లు తీర్మానం చేయించాలని ఎమ్మెల్యేకు రైతు జేఏసీ నాయకులు ఇప్పటికే స్పష్టం చేశారు. చేయని పక్షంలో ఎమ్మెల్యే ఇల్లు ముట్టడిస్తామని రైతు జేఏసీ అల్టిమేటం జారీ చేసింది. ఓవైపు కౌన్సిలర్లు, మరో వైపు ఎమ్మెల్యే గంప గోవర్ధన్ పై ఒత్తిడితో కామారెడ్డిలో ఉత్కంఠ వాతావారణం నెలకొంది.
Also Read....