- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
బీఆర్ఎస్ సస్పెన్షన్ వేటుపై జూపల్లి హాట్ కామెంట్స్
దిశ, వెబ్ డెస్క్: బీఆర్ఎస్ పార్టీ నుంచి సస్పెండ్ అయిన అనంతరం మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు మాట్లాడారు. పార్టీ నుంచి సస్పెండ్ చేయడం ఆనందంగా ఉందన్నారు. దొరల గడీ నుంచి బయటకి వచ్చానన్నారు. పంజరం నుంచి విడుదలైనట్లు ఉందన్నారు. మూడేళ్లుగా సభ్యత్వం పుస్తకాలు తనకు ఇవ్వలేదన్నారు. పార్టీ సభ్యుడిగా ఇన్నాళ్లు తాను ఉన్నట్టా లేనట్టా అని ప్రశ్నించారు. నా రాజీనామాతో తెలంగాణ వస్తుందా అని ఆనాడు సీఎం ప్రశ్నించారని తెలిపారు. రాజశేఖర్ రెడ్డి ఫోటో మా ఇంట్లో ఉందని, మా ఇంట్లో ఏ ఫోటో పెట్టుకోవాలో మీరు చెబుతారా అని నిరంజన్ రెడ్డిని ఉద్దేశించి అన్నారు.
ఓల్డ్ ఎమ్మెల్యే క్వార్టర్స్‌లో మాట్లాడేందుకు జూపల్లి యత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. ఎందుకు అడ్డుకుంటున్నారని జూపల్లి పోలీసుల మీద సీరియస్ అయ్యారు. అయితే నిన్న కొత్తగూడెంలో పొంగులేటి ఏర్పాటు చేసిన సభలో సీఎం కేసీఆర్, ఆయన కుటుంబంపై పొంగులేటి, జూపల్లి ఫైర్ అయ్యారు. ఈ నేపథ్యంలో ఈ రోజు ఉదయం వీరిద్దరిని సస్పెండ్ చేస్తూ పార్టీ ప్రకటన విడుదల చేసిన విషయం తెలిసిందే.