- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
వరంగల్ వేదికగా కేసీఆర్ అవినీతిపై గళమెత్తిన J P Nadda
దిశ, డైనమిక్ బ్యూరో: సీఎం కేసీఆర్ నిజాం తరహా పాలన కొనసాగిస్తున్నారని బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ఆరోపించారు. కేసీఆర్ నేతృత్వంలోని టీఆర్ఎస్ ప్రభుత్వం తెలంగాణను అంథకారంలోకి నెట్టిందని.. అంథకారాన్ని పారదోలి వెలుగులు నింపేందుకే బండి సంజయ్ ప్రజాసంగ్రామ యాత్ర చేపట్టారని అన్నారు. బీజేపీ స్టేట్ చీఫ్ బండి సంజయ్ చేపట్టిన మూడో ఫేజ్ పాదయాత్ర ముగింపు సభ శనివారం సాయంత్రం హన్మకొండలోని ఆర్ట్స్ కాలేజీలో జరిగింది. ఈ సభకు ముఖ్య అతిథిగా హాజరైన జేపీ నడ్డా ప్రసంగించారు. ఓరుగల్లు గడ్డకు నమస్కారం అంటూ తెలుగులో ప్రసంగాన్ని ప్రారంభించిన జేపీ నడ్డా.. భద్రకాళి అమ్మవారిని దర్శించుకోవడం తన అదృష్టంగా భావిస్తున్నాన్నారు. సభ నిర్వహించుకునేందుకు టీఆర్ఎస్ కుట్రలు చేశారని కానీ కోర్టు అనుమతితో ఈ సభ జరుగుతోందన్నారు. టీఆర్ఎస్ కుటుంబ పాలనను సాగనంపడానికే ప్రజాసంగ్రామ యాత్ర సంకల్పం అన్నారు. చివరి నిజాం మీర్ ఉస్మాన్ అలీఖాన్ తరహా పరిపాలన సాగిస్తున్నారని మండిపడ్డారు. తాను ఎయిర్ పోర్టు నుండి బయటకు రాకుండా ఆంక్షలు విధించారని, 144 సెక్షన్ పేరుతో సభకు ప్రజలు సభకు రాకుండా అడ్డుకున్నారని మండిపడ్డారు.
తెలంగాణలో ప్రజాస్వామ్యాన్ని కేసీఆర్ బంధీ చేశారని త్వరలోనే కేసీఆర్ ను తెలంగాణ ప్రజలు ఇంట్లో కూర్చోబెడతారని అన్నారు. జల్ జీవన్ మిషన్ కిందా రూ.3098 కోట్లను కేంద్రం ప్రకటించిందని కానీ ఇప్పటి వరకు తెలంగాణ రూ.200 కోట్లే ఖర్చు చేసిందన్నారు. కేంద్రం ఇచ్చే నిధులను కేసీఆర్ ప్రభుత్వం దుర్వినియోగం చేస్తున్నారని ఆరోపించారు. 40 వేల కోట్లతో పూర్తి కావాల్సిన కాళేశ్వరం ప్రాజెక్ట్‌కు రూ.లక్షా 40 వేల కోట్లు ఖర్చు పెట్టారని మండిపడ్డారు. 12 జిల్లాల్లో వరదలు వస్తే కేంద్రం విడుదల చేసిన నిధులను కేసీఆర్ పైసా ఇవ్వలేదని విమర్శించారు. కేంద్ర ప్రభుత్వ నిధులను కేసీఆర్ ప్రభుత్వం డైవర్ట్ చేస్తూ ప్రజలకు అందకుండా చేస్తున్నారని విమర్శించారు. కాళేశ్వరం కేసీఆర్ కు ఏటీఎం ప్రాజెక్టుగా మార్చుకున్నారని మండిపడ్డారు. కేంద్ర ప్రభుత్వ పథకాలను టీఆర్ఎస్ ప్రభుత్వ నిర్వీర్యం చేస్తోందని ఫైర్ అయ్యారు. వరంగల్‌లో ఆసుపత్రిని కడతామని ఆసుపత్రిని కూల్చారని.. ఇన్ని రోజులైనా మల్టీస్పెషాలిటీ ఆసుపత్రిని ఎందుకు కట్టలేదని ప్రశ్నించారు.
సీఎం కేసీఆర్ ఎంఐఎంకు భయపడి తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహించడం లేదని తాము అధికారంలోకి వచ్చాక సెప్టెంబర్ 17ను అధికారికంగా నిర్వహిస్తామని చెప్పారు. తెలంగాణ ఏర్పాటుకు మొట్టమొదట మద్దతు తెలిపింది బీజేపీయేనని అన్నారు. నరేంద్ర మోడీ హాయంలో అన్ని వర్గాల వారికి సక్షేమ పథకాలు అమలు చేస్తున్నామన్నారు. బీజేపీ ప్రభుత్వం అమలు చేస్తున్న అనేక పథకాలను కేసీఆర్ అడ్డుకుంటున్నారని మండిపడ్డారు. కేసీఆర్ ప్రభుత్వ అవినీతి ఢిల్లీ వరకు చేరిందని ఇలాంటి ప్రభుత్వాన్ని కొనసాగిద్దామా అని ప్రశ్నించారు. రాబోయే రోజుల్లో కేసీఆర్‌ను ఓడించాలని పిలుపునిచ్చారు.
Also Read : బీజేపీతో ప్రజాస్వామ్యానికి ప్రమాదం.. భట్టి విక్రమార్క ఫైర్
Also Read : ముగిసిన బండి సంజయ్ మూడో ఫేజ్ ప్రజాసంగ్రామ యాత్ర