- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
సంజయ్ అరెస్టుపై జేపీ నడ్డా ఆరా
దిశ, తెలంగాణ బ్యూరో : తెలంగాణ బీజేపీ స్టేట్ చీఫ్ బండి సంజయ్ అరెస్టుపై ఆ రాష్ట్ర జాతీయ నాయకత్వం ఫోకస్ పెట్టింది. అరెస్టుకు దారితీసిన కారణాలపైనా, లీగల్‌గా తీసుకుంటున్న చర్యలపైనా రాష్ట్ర లీగల్ సెల్ నాయకుడు రామచంద్రరావు (మాజీ ఎమ్మెల్సీ)కు ఫోన్ చేసిన నడ్డా తాజా పరిణామాలను అడిగి తెలుసుకున్నారు. అరెస్టు తర్వాత ఆయన ఆరోగ్య పరిస్థితి, కుటుంబ సభ్యుల ఆందోళన తదితరాలపై వాకబు చేశారు.
హైకోర్టులో దాఖలు చేసిన హెబియస్ కార్పస్ పిటిషన్, లంచ్ మోషన్ పిటిషన్‌పై వివరాలు అందించారు. అనంతరం రాంచందర్ రావు మీడియాతో మాట్లాడుతూ.. బండి సంజయ్‌ను పోలీసులు అరెస్టు చేయడం అప్రజాస్వామిక చర్య అని వ్యాఖ్యానించారు. అర్ధరాత్రి సమయంలో ఇంటికి వెళ్ళి అరెస్టు చేయాల్సిన అవసరం ఏమొచ్చిందని ప్రశ్నించారు. ఎందుకు అరెస్టు చేస్తున్నారో కారణాలను కూడా పోలీసులు వివరించ లేదని తెలిపారు. అరెస్టు చేసిన పద్ధతి కూడా సరైంది కాదన్నారు.
కరీంనగర్‌లోని నివాసంలో అరెస్టు చేసిన తర్వాత బొమ్మల రామారం పోలీస్ స్టేషన్‌కు ఎందుకు తీసుకుపోవాల్సి వచ్చిందని ప్రశ్నించారు. మీడియా రిపోర్టర్ వాట్సాప్ ద్వారా ప్రశ్నాపత్రాన్ని పంపిస్తే రాజకీయ నాయకులను అరెస్టు చేస్తారా అని ప్రశ్నించారు. రిపోర్టర్లు విధి నిర్వహణలో భాగంగా చాలా మంది మందికి సమాచారాన్ని పంపుతూ ఉంటారని, రాజకీయ నాయకులతోనూ పంచుకుంటారని అన్నారు. దీన్ని ఆధారంగా తీసుకుని కేసులు నమోదు చేస్తారా అని ప్రశ్నించారు.
Read more: