తెలంగాణ కాంగ్రెస్‌లో కీలక నేత చేరిక

by GSrikanth |
తెలంగాణ కాంగ్రెస్‌లో కీలక నేత చేరిక
X

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ కాంగ్రెస్ పార్టీ రోజురోజుకు బలపడుతోందని ఏఐసీసీ ఇన్‌చార్జి దీపాదాస్ మున్షీ అభిప్రాయపడ్డారు. గురువారం ఆమె హైదరాబాద్‌లోని గాంధీ భవన్‌లో మీడియాతో మాట్లాడారు. అంతకుమందు ప్రముఖ విద్యావేత్త స్రవంతి కాంగ్రెస్‌లో చేరారు. ఆమెకు దీపాదాస్ మున్షీ కండువాకప్పి ఆహ్వానించారు. అనంతరం మున్షీ మాట్లాడుతూ.. రాష్ట్రంలో కాంగ్రెస్‌కు అనుకూల వాతావరణం కనిపిస్తోందని అన్నారు. లోక్‌సభ ఎన్నికల్లోనూ కాంగ్రెస్ మెజార్టీ స్థానాలు దక్కించుకోబోందని చెప్పారు.

తెలంగాణలో ఎంత హడావుడి చేసిన ఇక బీఆర్ఎస్ పార్టీ అనేది కనిపించదు అని చెప్పారు. లోక్‌సభ ఎన్నికల్లోనూ కాంగ్రెస్, బీజేపీల మధ్యే ఉంటుందని అన్నారు. కాంగ్రెస్‌ అధికారంలోకి రావడాన్ని బీఆర్ఎస్ శ్రేణులు జీర్ణించుకోలేకపోతున్నారని తెలిపారు. కనీసం రెండు నెలలు కూడా కాకముందే విమర్శలు చేస్తూ ఆవేదన వెళ్లగక్కుతున్నారని మండిపడ్డారు. వందరోజుల్లో ఇచ్చిన గ్యారంటీలు అమలు చేస్తామని మరోసారి హామీ ఇచ్చారు. తమది మాట తప్పే పార్టీ కాదని.. అందుకే అమలుకు సాధ్యమయ్యే హామీలు మాత్రమే ఇచ్చారని గుర్తుచేశారు. ఒక్కొక్కటిగా గ్యారంటీలన్నీ అమలు చేస్తామని అన్నారు.

Advertisement

Next Story

Most Viewed