- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
కాంగ్రెస్‌లో చేరిక.. పరోక్షంగా క్లారిటీ ఇచ్చేసిన పొంగులేటి
దిశ, వెబ్‌డెస్క్: కాంగ్రెస్‌లో చేరికపై మాజీ ఎంపీ పొంగులేటి పరోక్షంగా క్లారిటీ ఇచ్చేశారు. నేను ఓ పార్టీలో చేరతానని బీఆర్ఎస్ నేతలు ఊహించారన్నారు. మందు పార్టీలు, పండగ చేసుకున్నారు. మారిన నా వ్యూహంతో ఇప్పుడు వాళ్లకు నిద్రపట్టడం లేదన్నారు. అయితే బీజేపీని ఉద్దేశించి ఆయన ఈ వ్యాఖ్యలు చేయగా కాంగ్రెస్ పార్టీలో చేరతారని క్లారిటీ ఇచ్చినట్లయింది. ఏ పార్టీలో ఎప్పుడు చేరతానో అధికారికంగా హైదరాబాద్‌లో చెప్తా అని పొంగులేటి అన్నారు. తన టార్గెట్ బీఆర్ఎస్ అన్నారు. వడ్డీతో సహా గులాబీ పార్టీకి ఇచ్చి పడేసే సమయం వచ్చిందన్నారు. ఏ పార్టీలో చేరాలనే విషయంలో ఉమ్మడి ఖమ్మంలో వేలాది మంది కార్యకర్తల అభిప్రాయం తీసుకున్నానన్నారు.
రాష్ట్ర ప్రజల దృష్టి ప్రస్తుతం ఖమ్మంపైనే ఉందన్నారు. తండ్రిలా భావించిన కేసీఆర్ మోసం చేశారని పొంగులేటి ఫైర్ అయ్యారు. తాను కురుక్షేత్ర యుద్ధం ప్రకటించి ఐదు నెలలు అవుతోందన్నారు. తనను నమ్ముకున్న అనుచరులు చెప్పినట్టే నడుస్తా అని పొంగులేటి అన్నారు. రాబోయే కురుక్షేత్రంలో ప్రజలు సమాధానం చెబుతారన్నారు. వివిధ జిల్లాల నేతలతో ఇప్పటికి చర్చలు జరుపుతున్నానని పొంగులేటి అన్నారు.