ఏంది సార్ ఇది.. డీజీపీకి జనగాం వాసి ట్వీట్

by Mahesh |
ఏంది సార్ ఇది.. డీజీపీకి జనగాం వాసి ట్వీట్
X

దిశ, డైనమిక్ బ్యూరో: హైదరాబాద్ నగరంలో ట్రాఫిక్ చలాన్లపై వాహనదారులు మండిపడుతున్నారు. ఇప్పటికే ట్రాఫిక్ చలాన్లు పెంచి సామాన్యులను ఇబ్బంది పెడుతున్నారని వాపోతుంటే.. మరోవైపు ఇష్టం వచ్చినట్టు ఎవరికి పడితే వారికి ఫైన్లు విధిస్తున్నారని వాహనదారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తాజాగా ట్రాఫిక్ రూల్స్ ఉల్లంఘనల్లో ఓ బండి పట్టుబడితే.. ట్రాఫిక్ పోలీసులు మరో బండికి ఫైన్ వేశారు. ట్రాఫిక్ రూల్స్ బ్రేక్ చేస్తూ పట్టుబడిన ఓ స్కూటి నెంబర్ కనపడకపోవడంతో, TS27C4258 నెంబర్ గల హెచ్ఎఫ్ డీలక్స్ బండికి ఫైన్ విధించారు.

ఈ మేరకు జనగామకు చెందిన సంపత్ పబ్బా అనే వాహనదారుడి బండికి ట్రాఫిక్ చలానా విధించడంపై ట్విట్టర్ వేదికగా డీజీపీకి ఫిర్యాదు చేశారు. ‘అయ్యా డీజీపీ గారు బండి నెంబర్ కనబడకపోతే ఎవరికి పడితే వారికి ఫైన్లు వేస్తున్నారు. జర పట్టించుకోండి. ఈ బండి మాది కానే కాదు. మాది హెచ్ఎఫ్ డీలక్స్ మీరు ఫోటో పెట్టింది స్కూటీ. కానీ మా బండికి ఫైన్ వచ్చింది. ఎలా అండి ఇలా అయితే అంటూ డీజీపీకి ట్వీట్ చేశారు. దీనిపై నెటిజన్లు కూడా మండిపడుతున్నారు. ఇష్టం వచ్చినట్లు ట్రాఫిక్ పోలీసులు చలాన్లు విధిస్తున్నారని కామెంట్స్ చేస్తున్నారు.

Advertisement

Next Story

Most Viewed