- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
BJLP LEADER: దేశాభివృద్ధి కోసమే జమిలీ ఎన్నికలు! బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి
దిశ, తెలంగాణ బ్యూరో: దేశ అభివృద్ధి కోసమే జమిలీ ఎన్నికలు నిర్వహిస్తున్నట్లు బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి తెలిపారు. జమిలీ ఎన్నికలతో డబ్బు, సమయం రెండూ ఆదా అవుతాయని వెల్లడించారు. నాంపల్లి బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో బుధవారం నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. దేశంలో నిత్యం ఏదో ఒకచోట ఎన్నికలు జరుగుతున్నాయని, దీంతో అభివృద్ధికి ఆటంకం ఏర్పడుతోందని వ్యాఖ్యానించారు. దేశ అభ్యున్నతి కోసం తీసుకునే నిర్ణయాలు కొందరికి నచ్చవని ప్రతిపక్షాలనుద్దేశించి విమర్శలు చేశారు. జమిలీ ఎన్నికలకు కొంత సమయం పడుతుందని, అందుకే కొన్ని రాష్ట్రాలకు ఎన్నికలు నిర్వహిస్తున్నట్టు వెల్లడించారు. పార్లమెంట్ లో జమిలీ బిల్లు ప్రవేశపెడతారని, అప్పుడు అందరికీ మాట్లాడే అవకాశం ఉంటుందని ఏలేటి గుర్తుచేశారు. ప్రతిపక్షాలకు ఏమైనా అభ్యంతరం ఉంటే పార్లమెంట్ చర్చల్లో చెప్పుకోవచ్చని సూచించారు. దేశంలో అన్ని సామాజికవర్గాల ప్రజల జీవన ప్రమాణాలు మెరుగు పర్చడమే లక్ష్యంగా ప్రధాని మోడీ వంద రోజుల పాలన పూర్తి చేసుకుందని తెలిపారు. కార్మిక, కర్షక, శ్రామికుల అభివృద్ధికి మోడీ ప్రభుత్వం పెద్ద పీట వేస్తుందన్నారు. ప్రపంచంలో మూడో అతిపెద్ద ఆర్థిక దేశంగా భారత్ నిలబడబోతోందని ఏలేటి మహేశ్వర్ రెడ్డి ధీమా వ్యక్తంచేశారు.