- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
'స్వేరో'కు వేల కోట్లు ఎలా వచ్చాయ్.. RS ప్రవీణ్ కుమార్కు బహిరంగలేఖ
దిశ, తెలంగాణ బ్యూరో: బీఎస్పీ స్టేట్ చీఫ్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ స్థాపించిన స్వేరోకు చెందిన బ్యాంకులో వేల కోట్లు డబ్బులు ఎక్కడ నుండి వచ్చాయో సమాధానం చెప్పాలని రాష్ట్ర నిరుద్యోగ విద్యార్థి జేఏసీ చైర్మన్ భీంరావు నాయక్ డిమాండ్ చేశారు. గిరిజన గురుకులాల్లో నాన్ టీచింగ్, టీచింగ్ పోస్టులను రూల్ అఫ్ రిజర్వేషన్ ప్రకారం ఎందుకు నియమించలేదని, ఏ కులాలకు చెందిన వారు అధికంగా ఉన్నారో ప్రజల సమక్షంలో పర్యవేక్షిద్దామని, అందుకు సిద్ధమా అని ఆయన గురువారం ప్రశ్నించారు.
బహుజన రాజ్యాధికార యాత్ర పేరిట ఆర్ఎస్పీ తెలంగాణలో తిరుగుతున్నారని, ముందుగా రాష్ట్రంలోని ఎస్సీ, ఎస్టీ, బీసీలకు సమాధానం చెప్పాక ఆయన ఓట్లు అడగాలన్నారు. గురుకులాల కార్యదర్శిగా ఉన్న సమయంలోనే సామాజిక న్యాయం చేయడం చేతకాలేదని, ఇప్పుడు ఏం ముఖం పెట్టుకుని ఆయన తిరుగుతున్నారో సమాధానం చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. ఒక వ్యక్తితో ఏజెన్సీలు పెట్టించి రూల్ అఫ్ రిజర్వేషన్ పాటించకుండా వారికి నచ్చిన వారిని ఉద్యోగులుగా నియమించారని, దీనిపై డిబేట్కు సిద్ధమా అని ప్రశ్నించారు. పదవికి రాజీనామా చేసినట్లు సీబీఐ, ఈడీ విచారణ చేయించమని దరఖాస్తు చేసే దమ్ము ప్రవీణ్ కుమార్కు ఉందా అని ఆయన ప్రశ్నించారు.
Also Read...
కాంగ్రెస్, బీజేపీ చీఫ్లు ఉండాల్సింది పిచ్చాస్పత్రుల్లోనే.. రేగా కాంతారావు