IT Raids On Malla Reddy: సోదరుడి ఇంట్లో లాకర్ కనుగొన్న ఐటీ అధికారులు

by Sathputhe Rajesh |   ( Updated:2022-11-22 07:39:43.0  )
IT Raids On Malla Reddy: సోదరుడి ఇంట్లో లాకర్ కనుగొన్న ఐటీ అధికారులు
X

దిశ ప్రతినిధి,మేడ్చల్ : మంత్రి మల్లారెడ్డి నివాసం‌తో పాటు అల్లుడు రాజశేఖర్ రెడ్డి, కొడుకులు మహేందర్ రెడ్డి, భద్రా రెడ్డి నివాసాలపై అరు గంటలుగా ఐటీ సోదాలు కొనసాగుతున్నాయి. సోదరుడు గోపాల్ రెడ్డి, వియ్యంకుడు లక్ష్మా రెడ్డి నివాసాల్లో సైతం సోదాలు జరుగుతున్నాయి. 14 విద్యాసంస్థల ప్రధాన కార్యాలయాలతో పాటు కళాశాల ఆర్ధిక లావాదేవీలపై ఐటీ శాఖ కూపి లాగుతుంది. బాలానగర్ రాజు కాలనీలో క్రాంతి బ్యాంక్ చైర్మన్ రాజేశ్వర్ రావు ఇంట్లో ఐటీ సోదాలు జరుగుతున్నాయి. క్రాంతి బ్యాంక్‌లో మల్లారెడ్డి ఇంజనీరింగ్ లావాదేవీలను ఐటీ అధికారులు గుర్తించారు. కళాశాల ఏకౌంట్స్‌కు సంబందించిన బ్యాంకు‌ల వివరాలను సైతం పరీశీలిస్తున్నారు కాగా మల్లారెడ్డి సోదరుడు ఇంట్లో లాకర్‌ను కనుగొన్నట్లు తెలిసింది. లాకర్‌ను ఓపెన్ చేసేందుకు ఓ వ్యక్తిని తీసుకువచ్చిన‌ట్లు సమాచారం.

Advertisement

Next Story

Most Viewed