- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఇంకో ఆరు రాష్ట్రాల బీజేపీ అధ్యక్షులు మారే ఛాన్స్..!
దిశ, డైనమిక్ బ్యూరో: ఇవాళ 5 రాష్ట్రాలకు బీజేపీ నూతన అధ్యక్షులుగా నియామకం చేసిన అధిష్టానం మరో 6 రాష్ట్రాలకు నూతన అధ్యక్షులను నియమించబోతున్నట్లు తెలుస్తోంది. అంధ్రప్రదేశ్ బీజేపీ నూతన అధ్యక్షురాలిగా పురందేశ్వరి, తెలంగాణకు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, ఝార్ఖండ్ భాజపా చీఫ్‌గా మాజీ సీఎం బాబూలాల్ మరాండీ, పంజాబ్ నూతన అధ్యక్షుడిగా సునీల్ జాక్కర్, రాజస్థాన్ అధ్యక్షుడిగా గజేంద్ర సింగ్ షెకావత్ లను నియమించినట్టు బీజేపీ అధిష్టానం ప్రకటించింది. వీరితో పాటు తెలంగాణ బీజేపీ నేత ఈటల రాజేందర్‌కు ఎలక్షన్ మేజేజ్మెంట్ కమిటీ చైర్మన్‌గా ఉమ్మడి ఏపీ చివరి సీఎం నల్లారి కిరణ్ కుమార్ రెడ్డిని పార్టీ జాతీయ కార్యవర్గ సభ్యుడిగా అధిష్టానం నియమించింది.
ఈ క్రమంలోనే కర్ణాటక , గుజరాత్, హర్యానా, జమ్మూ కాశ్మీర్, మధ్యప్రదేశ్, కేరళ అధ్యక్షులను మార్చి నూతన అధ్యక్షులను నియమించనున్నట్లు సమాచారం. కర్ణాటక రాష్ట్ర బీజేపీ అధ్యక్షులుగా శోభా కరంద్లాజే లేదా అశ్వత్ నారాయణ్, కేరళ కు వి. మురళీధరన్ లేదా సురేష్ గోపి, గుజరాత్ కు మన్సుఖ్ మాండవియా లేదా పురుషోత్తం రూపాలా, హర్యానా కు కృష్ణపాల్ గుజ్జర్ లేదా రామ్ విలాస్ శర్మ, జమ్మూకు డా. జితేంద్ర సింగ్ లేదా ఎంపీ జుగుల్ కిషోర్, మధ్యప్రదేశ్ కు తోమర్ లేదా ప్రహ్లాద్ పటేల్ లను నియమిస్తారనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి.