- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
CM కేసీఆర్‌కు బిగ్ షాక్.. తిరిగి BJP గూటికి చేరే యోచనలో కీలక నేత..?
దిశ, డైనమిక్ బ్యూరో: సార్వత్రిక ఎన్నికల మూడ్‌లోకి దేశం వెళ్తోంది. వివిధ రాష్ట్రాల్లోని రాజకీయ పార్టీలు తమ అస్త్ర శస్త్రాలకు పదును పెడుతున్నాయి. ఈ క్రమంలో బీహార్ సీఎం నితీష్ కుమార్ చేసిన అమిత్ షా ఫోన్ కాల్ వ్యాఖ్యలు పొలిటికల్ సర్కిల్స్‌లో హాట్ టాపిక్ అయ్యాయి. ఎన్డీయే కూటమి నుంచి గతేడాది బయటకు వచ్చిన నితీష్ కుమార్ బీజేపీకి వ్యతిరేకంగా పోరాటం చేస్తున్నారు.
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌తో పాటు పలువురు బీజేపీ వ్యతిరేక నేతలతో కలిసి పని చేయబోతున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఇలాంటి పరిస్థితుల్లో వారందరికి షాక్ ఇస్తూ నితీష్ కుమార్ తిరిగి తన పాత మిత్రుడైన బీజేపీ వద్దకే చేరుకుంటారా అనే ఊహాగానాలు బీహార్ పొలిటికల్ సర్కిల్స్‌లో చక్కర్లు కొడుతున్నాయి. అయితే నితీష్ కుమార్ విషయంలో ఇంతలా చర్చ జరగడానికి అసలేం జరిగిందంటే..
ఇటీవల కేంద్ర ప్రభుత్వం 12 రాష్ట్రాలకు కొత్త గవర్నర్లను నియమించిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా బీహార్‌కు విశ్వనాథ్ రాజేంద్ర అర్లేకర్‌ను కొత్త గవర్నర్‌గా నియమించింది. అయితే రాష్ట్రానికి కొత్త గవర్నర్ రాక విషయాన్ని తెలియజేయడానికి గత రాత్రి అమిత్ షా తనకు ఫోన్ చేశారని నితిష్ కుమార్ మంగళవారం చెప్పారు.
అయితే నాన్ బీజేపీ రూలింగ్ స్టేట్‌లలో ప్రభుత్వాలను కంట్రోల్ చేసేందుకు కేంద్ర ప్రభుత్వం గవర్నర్ వ్యవస్థలను ప్రయోగిస్తోందని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. గతంలో నితీష్ కుమార్ బీజేపీతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. కానీ గతేడాది ఎన్డీయే కూటమి నుంచి బయటకు వచ్చి మహా గట్ బంధన్ పేరుతో ఆర్జేడీతో కలిసి ప్రభుత్వాన్ని పంచుకుంటున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో తమ పార్టీకి గుడ్ బై చెప్పిన నితీష్ కుమార్‌కు అమిత్ షా ఫోన్ చేయడం వెనకు మతలబు ఏంటి అనే చర్చ జరుగుతోంది.
బీజేపీని ఓడించేందుకు జాతీయ స్థాయిలో పలువురు నేతలను నితీష్ కుమార్ స్వయంగా కలిశారు. ఈ నేపథ్యంలో వచ్చే ఎన్నికల నాటికి నితీష్ కుమార్‌ను తిరిగి తమ వైపు తిప్పుకునేందుకు బీజేపీ ప్రయత్నాలు చేస్తోందా అనే చర్చ జరుగుతోంది. దీంతో నితీష్ కుమార్‌కు అమిత్ షా కాల్ పట్ల ఆ రాష్ట్రంలో భిన్న స్వరాలు వినిపిస్తున్నాయి. దీంతో జేడీయూ అధికార ప్రతినిధి రణబీర్ నందన్ దీనిపై క్లారిటీ ఇచ్చారు.
నితీష్ కుమార్ ఎప్పుడూ సంకీర్ణ ధర్మాన్ని పాటిస్తున్నారని.. ఎవరితోనైనా మేము పూర్తిగా నిజాయితీ ఉంటున్నామన్నారు. బీజేపీనే అభద్రతా భావంతో ఉందని ఆరోపించారు. పొత్తులు, బీజేపీ ముక్త్ భారత్ నినాదానికి నితీష్ కుమార్ కట్టుబడి ఉన్నారన్నారు. ఇదిలా ఉంటే బీఆర్ఎస్ పేరుతో జాతీయ రాజకీయాలు చేయాలని చూస్తున్న సీఎం కేసీఆర్‌కు నితీష్ కుమార్ సహకారం ఎలా ఉండబోతోందనే చర్చ జరుగుతోంది.
గతంలో ఖమ్మం సభకు తనకు కేసీఆర్ ఆహ్వానించలేదని నితీష్ బహిరంగంగా చేసిన కామెంట్స్ రచ్చ రాజేశాయి. ఈ క్రమంలో సచివాలయం ప్రారంభోత్సవానికి ఆ పార్టీకి ఆహ్వానం పంపినా ఆ కార్యక్రమం వాయిదా పడింది. దీంతో అమిత్ షా తో కాల్ వ్యవహారం నితీష్ కుమార్ కు పొలిటికల్‌గా అగ్ని పరీక్షగా మారిందనే చర్చ జరుగుతోంది.
Also Read...
కాంగ్రెస్ నుండి సస్పెండ్ అవ్వడం కోసమే కోమటిరెడ్డి కామెంట్స్: మురళీధర్ రావు కీలక వ్యాఖ్యలు