ఒక వర్గానికి చెందిన వారి ఓట్లను మాత్రమే డిలీట్ చేయడం దుర్మార్గం!.. కిషన్ రెడ్డి

by Ramesh Goud |
ఒక వర్గానికి చెందిన వారి ఓట్లను మాత్రమే డిలీట్ చేయడం దుర్మార్గం!.. కిషన్ రెడ్డి
X

దిశ, డైనమిక్ బ్యూరో: షేక్ పేట్ డివిజన్ పరిధిలో దాదాపు 3 వేల ఓట్లను డిలీట్ చేశారని, ఒక వర్గానికి చెందిన ఓట్లను మాత్రమే డిలీట్ చేయడం దుర్మార్గమని సికింద్రాబాద్ బీజేపీ ఎంపీ అభ్యర్ధి కిషన్ రెడ్డి అన్నారు. సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలోని జూబ్లీహిల్స్ అసెంబ్లీ సెగ్మెంట్ షేక్ పేట్ లో ఓట్లు గల్లంతైన పోలింగ్ కేంద్రాన్ని కిషన్ రెడ్డి పరిశీలించారు. ఆయన మాట్లాడుతూ.. జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజవర్గంలో కొంతమంది అధికారులు ఒక పథకం ప్రకారం ఒక వర్గం వారి ఓట్లు డిలీట్ చేయడం జరిగిందని అన్నారు. ఇది చాలా దుర్మార్గమని, వారంత అనేక సంవత్సరాలుగా ఇక్కడే ఓటింగ్ లో పాల్గొంటున్నారని, వారికి ఇక్కడే సొంత ఇళ్లు ఉన్నాయని, కొందరు ఉద్యోగస్తులు కూడా ఉన్నారని తెలిపారు.

అకారణంగా ఓటింగ్ లిస్ట్ నుంచి వారి పేర్లు తొలగించారని, ఎవరో ఒక అధికారి ఓ వర్గం వారితో కుమ్మక్కు అయ్యి.. కేవలం ఒక వర్గం వారికి చెందిన దాదాపు 3 వేల ఓట్లు తొలగించారని అన్నారు. దీనిపై ఇప్పటికే జిల్లా ఎన్నికల అధికారికి, సికింద్రాబాద్ పార్లమెంట్ రిటర్నింగ్ అధికారికి ఫిర్యాదు చేశామని, వారు దర్యాప్తు చేపడతామని హమీ ఇచ్చారన్నారు. అంతేగాక ఈ ఘటనపై రాష్ట్ర, కేంద్ర ఎన్నికల సంఘానికి కూడా ఫిర్యాదు చేస్తామని స్పష్టం చేశారు.

Read More..

అందుకే హైదరాబాద్‌లో ఓటింగ్ తగ్గింది.. కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు

Advertisement

Next Story