- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
టీమ్ ఇండియా స్ఫూర్తి ఇదేనా..? మంత్రి కేటీఆర్ హాట్ కామెంట్స్
దిశ, డైనమిక్ బ్యూరో : గవర్నర్ల వ్యవస్థపై మంత్రి కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తమిళనాడు గవర్నర్ ఆర్‌ఎన్ రవికి వ్యతిరేకంగా సీఎం ఎంకే స్టాలిన్ నేతృత్వంలోని డీఎంకే ప్రభుత్వం చేసిన తీర్మానంపై మంత్రి కేటీఆర్ మంగళవారం ట్విట్టర్ వేదికగా స్పందించారు. అత్యున్నత రాజ్యాంగ పదవులు కేంద్రం చేతిలో రాజకీయ సాధనాలుగా మారాయంటూ మంత్రి కేటీఆర్ విమర్శలు గుప్పించారు. గవర్నర్ తీరుపై తమిళనాడు ప్రభుత్వం చేసిన తీర్మానాన్ని ప్రస్తావిస్తూ ట్వీట్ చేశారు.
బీజేపీయేతర రాష్ట్రాల విషయంలో కేంద్రం చూపుతున్న వివక్ష స్పష్టంగా కనిపిస్తుందని, ఎటువంటి సహకారం లేకుండా, వారు ప్రతీకారం తీర్చుకుంటున్నారు అని అనడానికి ఇదొక నిదర్శనం అని కేటీఆర్ ఎద్దేవా చేశారు. మన దేశంలోని బీజేపీయేతర ప్రభుత్వాలను ఇబ్బంది పెట్టేందుకు గవర్నర్లు తమ అధికారాలను దుర్వినియోగం చేస్తున్నారని పేర్కొన్నారు. దేశం అభివృద్ధి చెందడానికి సహాయపడే సహకార సమాఖ్య నమూనా ఇదేనా? టీమ్ ఇండియా స్ఫూర్తి ఇదేనా? అంటూ కేటీఆర్ విరుచుకుపడ్డారు.
కాగా, తమిళనాడు అసెంబ్లీ ఆమోదించిన బిల్లులను గవర్నర్ క్లియర్ చేయడం లేదని, ప్రజా సంక్షేమానికి వ్యతిరేకంగా ఆయన పనిచేస్తున్నారని స్టాలిన్ ప్రభుత్వం గవర్నర్ కు వ్యతిరేకంగా తీర్మానం చేసింది. సోమవారం అసెంబ్లీలో సీఎం స్టాలిన్ మాట్లాడుతూ... గవర్నర్‌కు వ్యతిరేకంగా తమ ప్రభుత్వం చేసిన రెండో తీర్మానమని తెలిపారు. గవర్నర్ నిర్లిప్త వ్యక్తిగా ఉండాలని సర్కారియా కమిషన్ పేర్కొందని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వ అధికారంలో గవర్నర్ జోక్యం చేసుకోకూడదని అంబేద్కర్ కూడా చెప్పారన్నారు. అలాగే గవర్నర్ గైడ్‌గా ఉండాలని అనేక సుప్రీంకోర్టు ఆదేశాలు కూడా స్పష్టం చేశాయన్నారు.