- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
వైరా నుంచి ఖమ్మం 16 కిలోమీటర్లేనట!
దిశ, వైరా : "నవ్విపోదురు గాక మాకెందుకు సిగ్గు" అన్న చందంగా ఉంది నేషనల్ హైవే, ఆర్ అండ్ బి అధికారుల తీరు. ఖమ్మం నుంచి వైరా వరకు ఉన్న జాతీయ రహదారికి ఇటీవల బీటీ రెన్యువల్ పనులు చేశారు. అనంతరం ఈ జాతీయ రహదారికి పక్కన కిలోమీటర్ల తెలిపే రాళ్ళను ఏర్పాటు చేశారు. ఈ రాళ్లపై రాసిన కిలోమీటర్ల దూరం తప్పుల తడకగా ఉంది. వైరాలోని మేరీ ఇమాక్లేట్ స్కూల్ ముందు జాతీయ రహదారి పక్కన ఖమ్మం దూరం 16 కిలోమీటర్లని తెలుపుతూ రాయిని ఏర్పాటు చేశారు. ఈ రాయి వేసిన ప్రాంతం నుంచి ఖమ్మం 22 కిలోమీటర్ల దూరంలో ఉంది.
అయితే అధికారులు మాత్రం ఈ రాయిపై ఖమ్మం 16 కిలోమీటర్ల దూరం అంటూ తప్పుగా రాశారు. అదేవిధంగా వైరాలోని పలు ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన కిలోమీటర్ల రాళ్లపై దూరాలు కూడా రెండు మూడు కిలోమీటర్ల తేడాతో తప్పుగా రాశారు. ఈ రాళ్ళను చూసిన స్థానికులు ఆర్‌అండ్‌బి అధికారుల పనితీరును విమర్శిస్తున్నారు. ఆర్‌అండ్‌బి అధికారులు లేదా సిబ్బంది రాళ్లను ఏర్పాటు చేసేటప్పుడు దగ్గరుండి పర్యవేక్షించాల్సి ఉంది. కానీ అధికారులు కనీసం పర్యవేక్షించకపోవడంతో ఈ పరిస్థితి ఏర్పడింది. ఇప్పటికైనా నేషనల్ హైవే ఆర్‌అండ్‌బి అధికారులు తమ తప్పులను సవరించుకుంటారో లేదో చూడాల్సిందే.
- Tags
- wyra