- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
కాంగ్రెస్ ఖతమైందా.. కేసీఆర్ కీలక వ్యాఖ్యలు
దిశ, వెబ్‌డెస్క్: బీఆర్ఎస్‌ను ఖతం చేస్తామని మాట్లాడుతున్నారని.. 25 ఏళ్ల పార్టీ ఖతం చేయగలరా అని బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ అన్నారు. ఆదివారం తెలంగాణ భవన్‌లో ఏర్పాటు చేసిన తెలంగాణ ఆవిర్భావ వేడుకల్లో ఆయన పాల్గొని మాట్లాడారు. ఎదురు దెబ్బలు తాత్కాలికమే అన్నారు. పదేళ్లు విపక్షంలో ఉన్న కాంగ్రెస్ ఖతమైందా అని ప్రశ్నించారు. ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే మనదే అధికారం అన్నారు. అన్ని రంగాల్లో తెలంగాణను నంబర్ వన్‌గా నిలిపామన్నారు. అప్పుడప్పుడూ కొంత విషపు గాలి వస్తుందని.. తప్పుడు ప్రచారాలు, హామీలకు ప్రజలు భ్రమ పడ్డారన్నారు. కేవలం ఒక శాతం తేడాతో మనం ఓడిపోయామని... ఎలా ఉన్నా ప్రజల కోసం పనిచేయడమే మన కర్తవ్యం అన్నారు.
గులాబీ జెండా పుట్టిందే తెలంగాణ సంరక్షణ కోసం అన్నారు. గులాబీ జెండా పనిచేసిందే తెలంగాణ కోసమన్నారు. తెలంగాణ వస్తుందని ఎవరూ కల కనలేదని.. 15 ఏళ్ల పోరాటం తర్వాత తెలంగాణ వచ్చిందని గుర్తు చేశారు. ఇవన్నీ టెంపరరీ సెట్ బ్యాక్స్ మళ్లీ తామే అధికారంలోకి వస్తామని కేసీఆర్ ధీమా వ్యక్తం చేశారు. అందులో 100 శాతం అనుమానం లేదన్నారు. తెలంగాణలో జనరేటర్లు, ఇన్వర్టర్లు మాయం చేశామని... కానీ మళ్లీ తెలంగాణలో ఆ రెండు వచ్చాయన్నారు. కరెంట్ పోని తెలంగాణను కరెంట్ లేని తెలంగాణ చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రైతు బంధు ఎందుకు బంద్ చేస్తున్నారని ప్రశ్నించారు. ప్రస్తుత ప్రభుత్వానికి రోజులు దగ్గర పడ్డాయన్నారు.