BRS ఆవిర్భావ వేళ KCR మిత్రుడి మౌనం.. జాతీయ రాజకీయాల్లో మద్దతు ఉన్నట్టా లేనట్టా..!

by Satheesh |   ( Updated:2022-12-10 15:05:14.0  )
BRS ఆవిర్భావ వేళ KCR మిత్రుడి మౌనం.. జాతీయ రాజకీయాల్లో మద్దతు ఉన్నట్టా లేనట్టా..!
X

దిశ, డైనమిక్ బ్యూరో: తెలంగాణ ఇంటి పార్టీగా ఇన్నాళ్లు ప్రచారం చేసుకున్న టీఆర్ఎస్ బీఆర్ఎస్‌గా మారిపోయింది. దీంతో జాతీయ రాజకీయాల్లో కేసీఆర్‌తో కలిసి వచ్చే వారు ఎవరూ అనే చర్చ తెరపైకి వస్తోంది. కర్ణాటక నుంచే బీఆర్ఎస్ రాజకీయ ప్రస్థానం ప్రారంభిస్తామని కేఆర్ ప్రకటించినా.. ఏపీలో బీఆర్ఎస్ పోటీ పైనే ప్రధానంగా చర్చ జరుగుతోంది. ఇందుకు బలం చేకూరేలా తాజాగా ఏపీలో బీఆర్ఎస్‌కు మద్దతుగా ఫ్లెక్సీలు వెలవడటం మరింత ఆసక్తిని పెంచుతోంది. దీంతో ఏపీ విషయంలో కేసీఆర్ వ్యూహం ఎలా ఉండబోతోందనేది ఉత్కంఠ రేపుతోంది.

తాజాగా, విజయవాడలో బీఆర్ఎస్ ఆవిర్భావాన్ని స్వాగతిస్తూ ఫ్లె్క్సీలు వెలిశాయి. మరో వైపు త్వరలో బీఆర్ఎస్ ఆఫీస్ విజయవాడలో ప్రారంభం కాబోతోందని ఈ మేరకు తెంలగాణ మంత్రులు ఇప్పటికే కసరత్తు ప్రారంభించినట్టు ప్రచారం జరుగుతోంది. కేసీఆర్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతోనే ఏపీలో బీఆర్ఎస్ విషయంలో చకచక అడుగులు ముందుకు పడుతున్నాయా అనే సందేహాలు రాజకీయ వర్గాల్లో వినిపిస్తున్నాయి. జాతీయ రాజకీయాల ప్రస్తావన మొదలైన నేపథ్యంలో గతంలో ఏపీకి చెందిన సీనియర్ నేత ఉండవల్లి అరుణ్ కుమార్‌తో కేసీఆర్ చర్చలు జరిపారు. ఆ తర్వాత ఆయన కేసీఆర్ విషయంలో కాస్త మౌనం దాల్చినా ఏపీలో ఆయన సేవలు ఉపయోగించుకునేందుకు కేసీఆర్ సిద్ధంగా ఉన్నాడనే ప్రచారం జరుగుతూనే ఉంది.

కీలక సమయంలో మిత్రుడి మౌనం..!

మరో వైపు బీఆర్ఎస్ ద్వారా నేషనల్ పాలిటిక్స్ ప్రవేశం కోసం ఉవ్విళ్ళూరుతున్న కేసీఆర్ విషయంలో ఆయన మిత్రుడు ఎంఐఎం పార్టీ చీఫ్ అసదుద్దీన్ ఒవైసీ మౌనం దాల్చడం హాట్ టాపిక్ గా మారింది. గతంలో బీఆర్ఎస్, ఎంఐఎం మధ్య ఒప్పందం కొనసాగింది. కేసీఆర్ ప్రభుత్వానికి ఒవైసీ బహిరంగంగానే మద్దతు తెలిపారు. ఆ తర్వాత జరిగిన జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ఈ రెండు పార్టీ నేతల మధ్య మాటల యుద్ధం జరిగినా ఫలితాల అనంతరం అంతా సర్దుకుంది. వచ్చే ఎన్నికల్లో ఎంఐఎం సొంతంగా తన సత్తా ఏంటో నిరూపించుకునేందుకు ప్రయత్నాలు చేస్తోందనే ప్రచారం జరుగుతోంది.

ఇటీవల గుజరాత్‌లోనూ కొన్ని స్థానాల్లో ఆ పార్టీ పోటీ చేసింది. జాతీయ స్థాయిలో బీజేపీకి వ్యతిరేకంగా తాము పోరాటం చేస్తున్నామని ఒవైసీ ప్రకటిస్తునప్పటికీ ఎంఐఎం విషయంలో మరో ప్రచారం తెరపైకి వస్తూనే ఉంది. కాంగ్రెస్, ఇతర ప్రాంతీయ పార్టీల ఓట్లను చీల్చడం ద్వారా ఎంఐఎం బీజేపీ ఫేవర్ చేస్తోందని.. ఇదందా బీజేపీతో ఉన్న అవగాహన ఒప్పందం మేరకే జరుగుతోందనే ఆరోపణలు ఉన్నాయి. ఈ ఆరోపణలను ఒవైసీ ఎప్పటికప్పుడు ఖండిస్తూనే ఉన్నారు. కానీ అదే బీజేపీ, కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా జాతీయ రాజకీయాల్లోకి వస్తున్న కేసీఆర్‌కు మద్దతు విషయంలో ఒవైసీ మౌనం ఎలా అర్థం చేసుకోవాలనే చర్చ రాజకీయ వర్గాల్లో జోరుగా జరుగుతోంది. వచ్చే ఎన్నికల్లో ఎంఐఎంతో బీఆర్ఎస్‌కు పొత్తు ఉంటుందా లేక ఫైట్ కొనసాగుతుందా అనేది ఆసక్తిగా మారింది.

Advertisement

Next Story

Most Viewed