జన్వాడ ఫామ్‌హౌజ్‌కు ఇరిగేషన్ అధికారులు

by Gantepaka Srikanth |   ( Updated:2024-08-27 15:38:01.0  )
జన్వాడ ఫామ్‌హౌజ్‌కు ఇరిగేషన్ అధికారులు
X

దిశ, వెబ్‌డెస్క్: హైదరాబాద్‌ శివారులోని జన్వాడ ఫామ్‌హౌజ్‌కు ఇరిగేషన్ అధికారులు చేరుకున్నారు. నిబంధనలకు విరుద్ధంగా, అక్రమంగా నిర్మించారని ఫిర్యాదులు రావడంతో మంగళవారం కొలతలు తీసుకునేందుకు అధికారులు ఫామ్‌హౌజ్‌కు వచ్చారు. కాగా, తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత చెరువులు, ప్రభుత్వ స్థలాలను కాపాడేందుకు హైడ్రాను ఏర్పాటు చేశారు. రాజధాని నగరంలో ఆక్రమణలను సత్వరమే గుర్తించి వాటిని అడ్డుకోవడం హైడ్రా లక్ష్యాల్లో అతి ముఖ్యమైనది.

ఇదే క్రమంలో జన్వాడ ఫామ్ హౌజ్‌పై కూడా హైడ్రాకు ఫిర్యాదులు వచ్చాయి. జన్వాడ ఫామ్ హౌజ్ జీవో 111కు విరుద్ధంగా నిర్మించారనే ఆరోపణలకు తోడు.. హైడ్రా త్వరలోనే ఈ ఫామ్ హౌజ్‌ను కూల్చేసే అవకాశం ఉందని చర్చ జరిగింది. దీంతో ఇవాళ ఇరిగేషన్ అధికారులు కొలతలు తీసుకుంటున్నారు. మరోవైపు తన ఫామ్‌హౌజ్ ఎఫ్‌టీఎల్ పరిధిలో లేదని.. రాజకీయ కారణాలతోనే కూల్చేయాలని ప్రయత్నాలు జరుగుతున్నాయని ప్రదీప్ రెడ్డి అనే అతను ఆరోపిస్తున్నారు.

Advertisement

Next Story