- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
మళ్లీ తెలంగాణ క్యాడర్‌కు ఐపీఎస్ అకున్ సబర్వాల్
దిశ, వెబ్ డెస్క్ : తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(Revanth Reddy) చేసిన ఢిల్లీ పర్యటన ఫలితాలను ఇస్తోంది. ఈనెల 7న హోంశాఖ మంత్రి అమిత్ షా(Amith Sha)తో మావోయిస్టు ప్రభావిత రాష్ట్రాల ముఖ్యమంత్రుల సమావేశానికి సీఎం రేవంత్ రెడ్డి కూడా హాజరయ్యారు. కాగా ఈ మీటింగ్ అనంతరం అమిత్ షాతో ప్రత్యేక సమావేశం అయిన సీఎం.. తెలంగాణకు మరింతమంది ఐపీఎస్ లను కేటాయించాల్సిందిగా కోరారు. అందులో భాగంగా శుక్రవారం సీనియర్ ఐపీఎస్ అకున్ సబర్వాల్(Akun Sabarwal) ను తెలంగాణకు రిలీవ్ చేస్తూ కేంద్ర హోంశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుతం ఐటీబీపీ ఐజీగా విధులు నిర్వహిస్తున్న అకున్ త్వరలోనే తెలంగాణకు రానున్నారు. కాగా అంతకముందు తెలంగాణలో కీలక బాధ్యతలు నిర్వహించిన 2023లో కేంద్ర హోంశాఖలోకి డిప్యుటేషన్ పై వెళ్లారు. కాగా అప్పట్లో రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన తెలుగు సినీ నటుల డ్రగ్స్ వ్యవహారం అకున్ ఎక్సైజ్ కమిషనర్ ఉన్నప్పుడే వెలుగులోకి వచ్చింది.