CMR College : సీఎంఆర్ కళాశాల ఘటనపై విచారణ ముమ్మరం

by Y. Venkata Narasimha Reddy |
CMR College : సీఎంఆర్ కళాశాల ఘటనపై విచారణ ముమ్మరం
X

దిశ, వెబ్ డెస్క్ : మేడ్చల్ కండ్లకోయ సీఎంఆర్ కళాశాల ఘటన(CMR College Incident)పై పోలీసులు దర్యాప్తు(Police Investigation)ముమ్మరం చేశారు. హాస్టల్ వార్డెన్ సహా ఏడుగురిని అదుపులో(Seven arrested)కి తీసుకుని విచారిస్తున్నారు. వారి నుంచి 12సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకుని వాటిలోని డేటాను, వీడియోలను పరిశీలిస్తున్నారు. విద్యార్థినుల బాత్ రూమ్ ల వద్ధ లభించిన వేలి ముద్రలను నిర్ధారించే నేపథ్యంలో అదుపులోకి తీసుకున్న వారి వేలి ముద్రలు సేకరించి ఫోరెన్సిక్ పరీక్షలకు పంపించారు. ఘటనపై విచారణ నేపథ్యంలో సీఎంఆర్ కళాశాలకు మూడు రోజుల పాటు సెలవులు ప్రకటించారు.

కళాశాల హాస్టల్ కు చెందిన విద్యార్థినిల బాత్ రూమ్ ల కిటికీల నుంచి సెల్ ఫోన్లతో వీడియోలు తీశారని, దాదాపుగా 300వీడియోలు తీశారంటూ ఆరోపణలు వెల్లువెత్తాయి. దీనిపై విద్యార్థినిలు, విద్యార్థి సంఘాల నాయకులు ఆందోళనకు దిగారు. రాష్ట్ర మహిళా కమిషన్ సైతం సుమోటోగా స్పందించి తక్షణమే విచారణ జరిపి నివేదిక ఇవ్వాలని పోలీసులను ఆదేశించింది.

Advertisement

Next Story

Most Viewed