Minister Seethakka: నేను ఎంత సున్నితమో.. అంత కఠినం కూడా

by Gantepaka Srikanth |
Minister Seethakka: నేను ఎంత సున్నితమో.. అంత కఠినం కూడా
X

దిశ, వెబ్‌డెస్క్: పల్లెలను ప్రగతి పథంలో నిలపాల్సిన బాధ్యత డీపీవో(DPO)లదే అని మంత్రి సీతక్క(Minister Seethakka) అన్నారు. ఆదివారం ఆమె మీడియాతో మాట్లాడారు. గ్రామీణ ప్రజలకు గౌరవప్రదమైన జీవనం అందేలా చూడాలని అధికారులకు సూచించారు. గ్రామాల్లో ఆరోగ్యకరమైన వాతావరణం ఉండేలా ప్రత్యేక చర్యలు చేపట్టాలని అన్నారు. స్థానిక పరిస్థితులను బట్టి ప్రణాళికల రూపొందించుకుని, ఆచరణలో పెట్టాలని ఆదేశించారు. స్థానిక ప్రజాప్రతినిధులు లేకపోయినా, ఒత్తిడి తట్టుకుని పని చేసిన డీపీవోలకు ఈ సందర్భంగా అభినందనలు చెప్పారు. గ్రామీణ ప్రజలకు సేవ చేసే భాగ్యం మీకే దక్కిందని అన్నారు. అందుకే ఉద్యోగంలా కాకుండా బాధ్యతగా ఉండాలని కోరారు. మానవతాన్ని జోడించి పని చేస్తే మంచి ఫలితాలు వస్తాయని సూచించారు. తప్పులను సరిదిద్దుకుని విధుల్లో వేగం పెంచాలని పిలుపునిచ్చారు. తాను ఎంత సున్నితమో.. అంత కఠినం కూడా అని స్వీట్ వార్నింగ్ ఇచ్చారు.

ఉద్యోగులుగా మీ సమస్యలను పరిష్కరించేందుకు నా వంతు సహకారం తప్పకుండా ఉంటుందని భరోసా ఇచ్చారు. అదే సమయంలో విధుల్లో అలసత్వం వహిస్తే సహించేది లేదని హెచ్చరించారు. 2017 నుంచి పెండింగ్‌లో ఉన్న కారుణ్య నియామకాల ఫైల్‌ను క్లియర్ చేయించిన విధంగానే.. మీ సమస్యలు ఉంటే కూడా పరిష్కరిస్తామని అన్నారు. ‘సిబ్బందితో 15 రోజులకు ఒకసారి సమీక్షలు నిర్వహించండి.. మనమొక్కరమే పని చేస్తే చాలదు.. మన కింద ఉన్న సిబ్బందితో స్నేహపూర్వక సంబంధాల కొనసాగించి పనులు చేయించాలి.. నా శాఖనే నా కుటుంబంగా భావిస్తా.. పంచాయతీ రాజ్(Panchayat Raj Department) గ్రామీణ అభివృద్ధి శాఖ మంత్రిగా ఉండటాన్ని అదృష్టంగా భావిస్తా.. మన పనితీరుతో ఆ అభిప్రాయం తప్పని నిరూపించాల’ అని సీతక్క సూచించారు. కోయ జాతికి చెందిన తాను కాంగ్రెస్ ఇచ్చిన అవకాశంతో మంత్రి అయ్యానని గుర్తుచేశారు.

Advertisement

Next Story

Most Viewed