- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
Sridhar Babu : తెలంగాణలో పెట్టుబడులు పెట్టండి.. మలేషియా పారిశ్రామిక వేత్తలతో శ్రీధర్ బాబు సమావేశం
దిశ, తెలంగాణ / డైనమిక్ బ్యూరో: తెలంగాణలో తాము తీసుకొచ్చిన సులభతర వాణిజ్య విధానాల వల్ల పరిశ్రమల స్థాపనకు దేశంలో ఎక్కడా లేనంత అనుకూల వాతావరణం ఏర్పడిందని ఐటీ, పరిశ్రమల మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు (Sridhar Babu) వెల్లడించారు. మలేషియా (Malaysia) తెలంగాణా దశాబ్ది ఉత్సవాలకు హాజరైన శ్రీధర్ బాబు ఆదివారం కౌలాంలంపూర్ లో అక్కడి పారిశ్రామిక వేత్తలతో సమావేశమయ్యారు. స్థానిక తెలంగాణ ఎన్నారైలు ఈ సమావేశాన్ని ఏర్పాటు చేశారు. తమ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడానికి ముందుకు రావాలని ఆయన పారిశ్రామిక వేత్తలకు పిలుపునిచ్చారు. మలేషియా- భారత్‌ల మధ్య వాణిజ్య సంబంధాలు మరింత బలపడాలని తాము కోరుకుంటున్నట్టు ఆయన వివరించారు. రెండు దేశాల సంస్కృతుల్లో అనేక సారూప్యతలు ఉన్నందున పరస్పర సహకారం మరింత తేలిక అవుతుందని శ్రీధర్ బాబు ఆకాంక్షించారు. డిసెంబరులోగా తెలంగాణ సందర్శించేందుకు తాము ఏర్పాట్లు చేస్తున్నామని మలేషియా పారిశ్రామిక వేత్తలకు ఆహ్వానం పలికారు.
రాజకీయ ప్రస్థానానికి 25 ఏళ్లు
అనూహ్య పరిస్థితుల్లో ప్రజాసేవలోకి వచ్చిన తాను ప్రజా ప్రతినిధిగా నవంబర్ పదితో 25 ఏళ్లు పూర్తి చేసుకున్న విషయం ఇక్కడి మిత్రులు చెప్పేదాక తనకు గుర్తు లేదన్నారు. ఈ సందర్భంగా అభినందనలు తెలిపిన వారందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నట్టు వెల్లడించారు. రెండున్నర దశాబ్దాల రాజకీయ ప్రస్థానంలో పార్టీలో ఎంతో ప్రాధాన్యతనిచ్చి ప్రోత్సహిస్తూ వచ్చిన సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, మల్లిఖార్జున్ ఖర్గేలకు ఎప్పటికీ రుణపడి ఉంటానని అన్నారు. మంత్రిగా తాను పనిచేసిన నలుగురు ముఖ్యమంత్రులు తన పట్ల ఎంతో ఆదరాభిమానాలు కనబర్చారని తెలిపారు. ఇన్నేళ్లుగా తనను ఆదరిస్తున్న సహచరులకు, తన వెంట నిలిచిన ప్రజలకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఈ సమావేశంలో టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, సాట్ చైర్మన్ శివసేనా రెడ్డి తదితరులు పాల్గొన్నారు.