భవిష్యత్ కార్యచరణ ప్రకటిస్తా.. BJP సీనియర్ నేత మురళీధర్ రావు సంచలన ట్వీట్

by GSrikanth |
భవిష్యత్ కార్యచరణ ప్రకటిస్తా.. BJP సీనియర్ నేత మురళీధర్ రావు సంచలన ట్వీట్
X

దిశ, వెబ్‌డెస్క్: బీజేపీ పార్లమెంట్ అభ్యర్థుల తొలి జాబితా తెలంగాణలో దుమారం రేపుతోంది. ముఖ్యంగా రెండు మూడు నియోజకవర్గాల్లో బీజేపీ నేతలు ఆందోళనలు చేస్తున్నారు. మొదటి నుంచి పార్టీని అంటిపెట్టుకొని ఉన్నవారిని కాదని.. నిన్న, మొన్న చేరిన బీఆర్ఎస్ నేతలకు టికెట్‌లు ఇవ్వడాన్ని కాషాయ శ్రేణులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. జహీరాబాద్, నాగర్ కర్నూలు, మల్కాజ్‌గిరి సీట్ల కేటాయింపుపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. తాజాగా.. మల్కాజ్‌గిరి టికెట్ ఆశించి భంగపడ్డ BJP సీనియర్ నేత మురళీధర్ రావు సోసల్ మీడియా వేదికగా స్పందించారు.

‘మల్కాజ్‌గిరిలో నా కోసం పనిచేసిన అందరికీ ధన్యవాదాలు. త్వరలోనే నా అనుచరులను, కార్యకర్తలను వ్యక్తగతంగా కలుస్తా. ఆపై భవిష్యత్ కార్యచరణ ప్రకటిస్తా’ అని ఎక్స్(ట్విట్టర్‌) వేదికగా మురళీధర్ రావు పోస్టు పెట్టారు. ప్రస్తుతం ఈ పోస్టు బీజేపీ శ్రేణులను కలవరపాటుకు గురిచేస్తోంది. కాగా, తెలంగాణపై ఫోకస్ పెట్టిన బీజేపీ అధిష్టానం పార్లమెంట్ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా పావులు కదుపుతోంది. అందుకే వివాదాస్పదం లేకుండా ఉంటే తొమ్మిది నియోజకవర్గాల అభ్యర్థులను తొలి జాబితాలో ప్రకటించారు. కీలక మహబూబ్‌నగర్, మెదక్, వరంగల్, పెద్దపల్లి, నల్లగొండ, ఖమ్మం, మహబూబాబాద్ స్థానాలు ప్రకటించాల్సి ఉంది.

Advertisement

Next Story