మామూను హ్యాట్రిక్ CM చేయాలి.. బీఆర్ఎస్‌కు మద్దతుపై ఓవైసీ ఇంట్రెస్టింగ్ కామెంట్స్

by Satheesh |   ( Updated:2023-11-27 10:00:06.0  )
మామూను హ్యాట్రిక్ CM చేయాలి.. బీఆర్ఎస్‌కు మద్దతుపై ఓవైసీ ఇంట్రెస్టింగ్ కామెంట్స్
X

దిశ, డైనమిక్ బ్యూరో: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో అధికార బీఆర్ఎస్ పార్టీకి మద్దతు ఇవ్వడంపై ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఓవైసీ క్లారిటీ ఇచ్చారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌ పార్టీకి ఏఐఎంఐఎం మద్దతిస్తున్నట్లు కనిపిస్తుందిగా అని మీడియా ప్రతినిధి ప్రశ్నకు ఎంపీ అసదుద్దీన్‌ ఓవైసీ ఆసక్తికర సమాధానం ఇచ్చారు. తమ పార్టీ నుంచి బీఆర్‌ఎస్‌కు బహిరంగ మద్దతేమీ లేదని, అయితే.. తమ అభ్యర్థులు బరిలో లేని దగ్గర మామూ (కేసీఆర్‌)ను హ్యాట్రిక్‌ సీఎం చేయాలని చెబుతున్నామని ఆయన వెల్లడించారు. కాబట్టి, మేం వాళ్లపై పోటీ చేస్తున్నాం, వాళ్ళు మాపై పోటీ చేస్తున్నారు.. అంతేతప్ప బీఆర్‌ఎస్‌కు మా బహిరంగ మద్దతేమీ లేదని అసదుద్దీన్‌ సమాధానం చెప్పారు.

Advertisement

Next Story