ఇందిరమ్మ రాజ్యం అంటే నక్సలిజం.. KTR సంచలన వ్యాఖ్యలు

by Sathputhe Rajesh |   ( Updated:2023-11-23 06:18:24.0  )
ఇందిరమ్మ రాజ్యం అంటే నక్సలిజం.. KTR సంచలన వ్యాఖ్యలు
X

దిశ, వెబ్‌డెస్క్: 6 నెలలకు ఒక సారి మారే సీఎంను ప్రజలు కోరుకోరని.. రాజకీయ నిరుద్యోగులే మార్పు కోరుకుంటున్నారని మంత్రి కేటీఆర్ అన్నారు. ఓ ఛానల్ లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. కాంగ్రెస్ వస్తే రియల్ ఎస్టేట్ ఢమాల్ అవడం ఖాయమన్నారు. కర్ణాటకలో కాంగ్రెస్ వచ్చాక 28 శాతం రియల్ ఎస్టేట్ పడిపోయిందన్నారు. ఇందిరమ్మ రాజ్యం అంటే ఆకలి రాజ్యం, నక్సలిజం, నిరుద్యోగం అన్నారు. ఇందిరమ్మ పాలన విఫలం కావడంతో ఎన్టీఆర్ అధికారంలోకి వచ్చారని గుర్తు చేశారు.

రేవంత్ రెడ్డి రెండు చోట్ల ఓడి పోవడం ఖాయమన్నారు. నిరుద్యోగం ప్రపంచ వ్యాప్తంగా ఉందని.. తమకంటే ఎక్కువ ఉద్యోగాలు ఇచ్చిన స్టేట్ చూయించాలని సవాల్ విసిరారు. గుజరాత్ లోనూ అనేక మార్లు పేపర్ లీకేజీ అయిందన్నారు. బీఆర్ఎస్ ఎప్పటికీ సెక్యులర్ పార్టీగానే ఉంటుందన్నారు. తాము ఏ పార్టీకి బీ టీమ్ కాదన్నారు. గతంలో ఎన్నడూ బీజేపీతో పొత్తు పెట్టుకోలేదన్నారు. 2004లో కాంగ్రెస్ తో తెలంగాణ డిమాండ్ తో పెట్టుకున్నామని గుర్తు చేశారు. 2009లో టీడీపీతో మహాకూటమిలో పొత్తులో ఉన్నామన్నారు. తెలంగాణ ఇస్తామన్న డిమాండ్ మేరకు ఆనాడు పొత్తు పెట్టుకున్నామన్నారు.

Advertisement

Next Story

Most Viewed