తెలంగాణ మంత్రులందరి అధికారులు ఆయన ఒక్కడి చేతిలోనే: ఇందిరా శోభన్ ఫైర్

by Satheesh |
తెలంగాణ మంత్రులందరి అధికారులు ఆయన ఒక్కడి చేతిలోనే: ఇందిరా శోభన్ ఫైర్
X

దిశ, డైనమిక్ బ్యూరో: లిక్కర్ స్కామ్ కేసులో తన బిడ్డ కోసం ఆగం ఆగం అవుతున్న సీఎం కేసీఆర్ రాష్ట్ర ప్రజల బిడ్డలకు కష్టాలు వస్తే మాత్రం మౌనంగా ఉంటున్నారని సీనియర్ పొలిటీషియన్ ఇందిరా శోభన్ మండిపడ్డారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక వచ్చిన ఏ ఒక్క ఉద్యోగ నోటిఫికేషన్ సక్రమంగా లేదని ధ్వజమెత్తారు. శనివారం మాట్లాడిన ఆమె.. ఇకనైనా పీఆర్సీ నివేదిక ప్రకారం ఉద్యోగాల భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. టీఎస్ పీఎస్సీ లీకేజీపై షాడో ముఖ్యమంత్రి కేటీఆర్ బాధ్యత వహించాలన్నారు. ప్రస్తుతం రాష్ట్రంలోని ఏ మంత్రికి స్వతంత్రంగా అధికారాలు లేదని అన్ని శాఖలను షోడో సీఎంగా కేటీఆరే చూస్తున్నారని ధ్వజమెత్తారు. ఏదైనా ఫిర్యాదు చేద్దామంటే సీఎస్ అపాయింట్ మెంట్ ఇవ్వడం లేదని ఆరోపించారు.

ప్రశ్నాపత్రాల లీకేజీ వెనుక ప్రవీణ్, రాజశేఖర్ రెడ్డిలు మాత్రమే లేరని మరి కొంతమంది పెద్దల ప్రమేయం ఉందనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయన్నారు. అందువల్ల సీబీఐ విచారణ చేపట్టి నిజానిజాలేంటో తేల్చాలన్నారు. ఫీజులు కట్టొద్దని కేటీఆర్ అంటున్నారని ఇదివరకే కట్టిన నోటిఫికేషన్‌కు మరోసారి ఎందుకు కడుతారని ప్రశ్నించారు. మీరు చేసిన తప్పిదానికి మరోసారి ఫీజు వసూలు చేయడం ఉండదని మరోసారి ఫీజు తీసుకోకపోవడంలో ప్రభుత్వం ఉదారత ఏమి లేదన్నారు. టీఎస్ పీఎస్సీ అంశంపై గవర్నర్ కు ఫిర్యాదు చేయబోతున్నట్లు తెలిపారు. కేటీఆర్ ఇలాకాలో ఆత్మహత్యకు పాల్పడిన నవీన్ కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్ చేశారు. స్వప్నలోక్ బిల్డింగ్ లో అగ్నిప్రమాదంపై విచారం వ్యక్తం చేసిన ఇందిరా శోభన్.. క్యూనెట్ సంస్థపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

Advertisement

Next Story

Most Viewed