ఎమ్మెల్యేలపై కేసు నమోదు చేయాలి : ఇందిరా శోభన్​

by Vinod kumar |
ఎమ్మెల్యేలపై కేసు నమోదు చేయాలి : ఇందిరా శోభన్​
X

దిశ, తెలంగాణ బ్యూరో: దళిత బంధులో కమీషన్లు తీసుకున్న ఎమ్మెల్యేలపై వెంటనే క్రిమినల్​ కేసులు నమోదు చేయాలని ఇందిరాశోభన్​ పేర్కొన్నారు. కమీషన్లు తీసుకున్నోళ్ల జాబిత తన వద్ద ఉన్నదని స్వయంగా సీఎం కేసీఆర్ ప్రకటించారని, దీన్ని హైకోర్టు సుమోటోగా తీసుకోవాల్సిన అవసరం ఉన్నదని ఆయన శుక్రవారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. దళితబంధులో జరుగుతోన్న అవినీతిపై సీఎం కేసీఆర్ హైకోర్టుకు లేఖ రాయాలని లేకపోతే ఏసీబీ డీజీకి చిట్టా వివరాలివ్వాలన్నారు. ఈ రెండు జరగకపోతే ఏసీబీ డీజీ సీఎం కేసీఆర్ కు నోటీసులివ్వాలన్నారు.

ప్రభుత్వంలో అవినీతి జరుగుతుందని తెలిసినా ఎటువంటి చర్యలు తీసుకోని కేసీఆర్ కు ముఖ్యమంత్రి సీటులో కూర్చునే నైతికత లేదని విమర్శించారు.ముషీరాబాద్ నియోజకవర్గంలో ఆర్​టీఐ డేటా ప్రకారం దళిత జనాభా 50 వేలు మంది ఉండగా, 96 మందికి దళిత బంధు ఇచ్చారన్నారు. కానీ ఇచ్చిన 96 మందిలో 90 మంది అధికార పార్టీ కి చెందినోళ్లే ఉన్నట్లు తెలిపారు.ఇందులో ఎన్​ఆర్​ఐ ఐటీ ఉద్యోగులు కూడా ఉండటం ఆశ్చర్యం కలిగించిందన్నారు.దీంతో రాష్ట్రవ్యాప్తంగా దళిత బంధు కింద మంజూరైన యూనిట్లకు జీపీఎస్​ తో ఎక్స్,వై కో–ఆర్డినేటర్లు వేసి లింక్అప్ చేయాలన్నారు.అవినీతికి పాల్పడిన ఎమ్మెల్యేలను వెంటనే భర్తరఫ్ చేయాలన్నారు.

Advertisement

Next Story