తాళ్ల పేరుతో ఇష్టా రాజ్యం.. అన్నదాత నిలువు దోపిడి..!?

by Sathputhe Rajesh |
తాళ్ల పేరుతో ఇష్టా రాజ్యం.. అన్నదాత నిలువు దోపిడి..!?
X

మిల్లర్లు రైతులను నిలువునా దోపీడీ చేస్తున్నారు. క్వింటాల్​ ధాన్యం తూకం వేస్తే తరుగు పేరిట రెండు, మూడు కిలోలు తీసుకునే వారు. కానీ ఈసారి ఏకంగా ‘14 కిలోలు అయితేనే ధాన్యం దించుకుంటాం.. లేకుంటే మీ ఇష్టం..’ అంటూ రైతులను మోసం చేస్తున్నారు. అకాల వర్షంతో పెట్టుబడి రాని విధంగా మారిన రైతుల పరిస్థితిపై జాలి చూపాల్సిందిపై దోచుకోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి రైస్​ మిల్లర్లపై చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. – దిశ, మెదక్​ ప్రతినిధి

జిల్లాలో ఈదురు గాలుల వాన అన్నదాతలను అపార నష్టాల పలు జేసింది. ఆరుగాలం కష్టపడి పండించిన పంట చేతికి వచ్చే దశలో వర్షార్పణం కావడం చూసిన ప్రజలు, ప్రభుత్వం అయ్యో అంటూ జాలి చూపించారు. రాష్ట్ర ప్రభుత్వం రైతులను ఆదుకుంటామని హామీ ఇవ్వడం తో పాటు తేమ, తడిసిన ధాన్యం కూడా కొనుగోలు చేస్తామని ప్రకటన కూడా చేసింది. జిల్లాలో ఐకేపీ, ప్యాక్స్, మార్కెట్ కమిటీ అధ్వర్యంలో జిల్లాలో412 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి వరి ధాన్యం కొనుగోలు చేస్తుంది. జిల్లాలో ఆయా మండల వారీగా రైస్ మిల్లర్లకు కేటాయించారు. జిల్లాలో అకాల వర్షాల వల్ల పెద్ద ఎత్తున నష్టం జరగడం తో పాటు ధాన్యం చాలా కేంద్రాల్లో తడిసింది. ఇందుకు ప్రభుత్వం స్పందించి తేమ శాతం నిబంధన లేకుండా తడిసిన ధాన్యం కొంటామని హామీ ఇవ్వడం తో రైతాంగం సంతోషం వ్యక్తం చేశారు.

రైస్ మిల్లర్ల దురాశ...

అకాల వర్షం వల్ల అన్నదాత తీవ్రంగా నష్టపోయిందని ప్రతి ఒక్కరూ జాలి చూపిస్తే జిల్లాలో రైస్ మిల్లర్లు కొంత మంది దుర్బుద్ధి చూపిస్తున్నారు.. ప్రభుత్వం చెప్పినా మాకేం.సంబంధం లేదు అనే విధంగా లాభాజర్జనే ధ్యేయంగా చూస్తున్నారు. ధాన్యం తూకం వేసిన తరవాత అంత కొనుగోలు కేంద్రంలోనే అన్ని చుకుకోవాలి.. తేమ, ఇతర ఏదైనా కొనుగోలు కేంద్రం పరిధిలోకి వస్తుంది. కాని ఇక్కడ ధాన్యం లో తాళ్ళ వంక పేరుతో మిల్లర్లు అడ్డంకులు సృష్టిస్తున్నారు.. కేంద్రం నుంచి వచ్చిన ధాన్యం లో తాళ్ళ ఉన్నాయని... వాటిని తీసుకోవాలంటే క్వింటాల్ కు 14 నుంచి 16 కిలోల వరకు తరుగు ఇవ్వాలని ఆంక్షలు పెడుతున్నారు. రైతులు ఒప్పుకుంటే ఒకే.. లేదంటే వచ్చిన ధాన్యం మిల్లుల వద్ద దించుకోకుండా (అన్ లోడ్) నిలిపి వేస్తున్నారు. మిల్లు యజమాని చెప్పే ఆంక్షలు వింటే రైతులు అంత నష్టపోవాల్సి వస్తుంది.

14 నుంచి 16 కిలోల క్వింటాల్ కు అంటే దాదాపు 15 శాతం కోత పడింట్టే.. సాధారణ పంట చేతికి సక్రమంగా వస్తె రైతులకు మిగిలేది 20 నుంచి 30 శాతం.. పెరిగిన రసాయనాలతో అంత పెట్టుబడికి పోతుంది. ఇక వచ్చిన 30 శాతం ఆదాయం లో తెచ్చిన అప్పులకు వడ్డీ, ఇతర కర్చులు మళ్ళీ అప్పులే. ఇక ప్రస్తుత సీజన్ లో అకాల వర్షాల వల్ల ధాన్యం 30 శాతం వరకు నీటి పాలైంది. అందులో మిల్లర్ లు 15 శాతం తాళ్ళ పేరుతో దొచేస్తే అన్నదాతకు మిగిలేది అప్పుల ఉరితాడే.. అన్నట్టుగా మారుతుంది. ప్రతి ఏటా తాళ్ళ పేరుతో మిల్లర్లు దొస్తున్న 4 నుంచి 6 కిలోల వరకు ఉండేది.. కానీ ఈ సారి రైతుల పుండు మీద మిల్లర్ల తీరు కారం చల్లినట్లుగా మారుతుంది.. అధికారులు స్పందించకుంటే జిల్లాలో రైతాంగం అకాల వర్షం కంటే అధిక నష్టం మిల్లర్ల వల్లే కలిగే ప్రమాదం ఉంది.

ఎల్లాపూర్ రైస్ మిల్లులో 14 కు తగ్గరట..

మెదక్ మండలం పేరూల్‌లో పీఏసీఎస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రం నుంచి అదే గ్రామానికి చెందిన రైతు వీరయ్య 313 బస్తాలు, శ్రీనివాసరెడ్డి 189 బస్తాలు, అవడం రాములు 88 బస్తాలతో ఎల్లాపూర్ కు చెందిన రైస్ మిల్ గోదాం మార్కెట్ యార్డులో ఏర్పాటు చేస్తే అక్కడికి వాహనంలో ధాన్యం తీసుకొచ్చారు.. తమ మిల్లుకు వచ్చే దాన్యంకు 14 కిలోల తరుగు తీసుకుంటున్నామని అందుకు రైతులు అంగీకరిస్తేనే ధాన్యం తెంచుకుంటామని చెప్పడంతో ఒక్కసారిగా ముగ్గురు రైతులు ఆందోళన గురయ్యారు.. ప్రభుత్వం వర్షాల వల్ల దాన్యం ఎలా ఉన్నా తీసుకుంటామని చెబుతుంటే మిల్లర్లు తరుగు పేరుతో 14 కిలోలు దోచేయడమేంటని వారు ప్రశ్నించారు.. తమ ధాన్యంలో తాళ్ల శాతం అంతగా లేకుండా 14 కిలోలు తీసుకోవడం ఏంటని ప్రశ్నిస్తే వారి ధాన్యాన్ని దించుకోవడానికి మిల్లు యజమాని నిరాకరించినట్లు అక్కడే ఉన్న గుమాస్తా రైతులకు చెప్పాడు. దీంతో రైతులు ఆర్డీవో దృష్టికి తీసుకెళ్లగా తాను మాట్లాడుతాను అని చెప్పడమే తప్ప సమస్యను మాత్రం పట్టించుకోవడంలేదని ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో కూడా ఎల్లాపూర్ రైస్ మిల్ యజమాని తరుగు పేరుతో దోచుకున్నారని, ఈసారి కూడా అదే ప్రయత్నం చేస్తున్నట్లు రైతులు ఆరోపించారు..

ఇలాగైతే అప్పుల ఉరితాడే..

ఎల్లాపూర్ రైస్ మిల్ యజమాని చెప్పినట్లు క్వింటాల్ కు 14 కిలోలు తరుగు తీసిన పెట్టుబడి మినహా తమ అప్పులు తీరవని రైతు శ్రీనివాసరెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం చెప్పేదానికి మిల్లర్లు చేసే దానికి భారీ తేడా ఉందన్నారు. ధాన్యం పొల్లు పేరుతో క్వింటాల్ 14 కిలోలు తరుగు తీయడం ఇదెక్కడి న్యాయమని ప్రశ్నించారు.

– శ్రీనివాసరెడ్డి , రైతు పేరూరు

14 కిలోలు ఎప్పుడూ చూడలేదు..

ధాన్యం ఆరపెట్టి కష్టపడి మిల్లుకు తీసుకొస్తే 14 కిలోలని ఆంక్షలు పెడుతున్నారు.. తాము కష్టపడితే వచ్చే లాభాల కంటే రైస్ మిల్లు అడిగేదే ఎక్కువగా ఉంది.. అన్ని ఊర్లో వాళ్ళు ఇస్తున్నారు మీరు కూడా ఇవ్వాలని రైస్ మిల్ యజమాని డిమాండ్ చేస్తున్నాడని రైతు వీరయ్య ఆవేదన వ్యక్తం చేశారు.

– వీరయ్య.. పేరూరు

Advertisement

Next Story