అఫిడవిట్‌లో తనకు కారు లేదని పేర్కొన్న ఈటల.. ఆస్తులు ఎన్నంటే..!

by Sathputhe Rajesh |   ( Updated:2023-11-08 06:30:37.0  )
అఫిడవిట్‌లో తనకు కారు లేదని పేర్కొన్న ఈటల.. ఆస్తులు ఎన్నంటే..!
X

దిశ, వెబ్‌డెస్క్: హుజురాబాద్ బీజేపీ అభ్యర్థి ఈటల తన ఎన్నికల అఫిడవిట్ లో సొంత కారు లేదని పేర్కొన్నారు. ఇక, హుజురాబాద్ బీజేపీ అభ్యర్థిగా ఈటల తరపున ఆయన సోదరుడు భద్రయ్య నామినేషన్ దాఖలు చేశారు. ఎన్నికల అఫిడవిట్ లో ఈటల వద్ద రూ.లక్ష, ఆయన భార్య వద్ద రూ.లక్షన్నర నగదు మాత్రమే ఉన్నట్లు తెలిపారు. స్థిరాస్తులు రూ.12.50 కోట్లు, భార్య పేరిట రూ. 14.78 కోట్లు, రూ.26.48 కోట్ల చరాస్తులు, 1500 గ్రాముల బంగారం ఉన్నట్లు పేర్కొన్నారు. అప్పులు రూ.15. 51 కోట్లు ఉన్నట్లు తెలిపారు. మొత్తం రూ.53.94 కోట్ల ఆస్తులు ఉన్నట్లు అఫిడవిట్‌లో పేర్కొన్నారు. కాగా ఎన్నికల అఫిడవిట్‌లో ఈటల తనకు సొంత కారు లేదని పేర్కొనడం చర్చనీయాంశంగా మారింది.

Advertisement

Next Story

Most Viewed