రైలు సర్వీసులపై వరదల ప్రభావం.. రెండు రోజుల్లో భారీగా రైళ్ల రద్దు

by Mahesh |   ( Updated:2024-09-02 15:29:26.0  )
రైలు సర్వీసులపై వరదల ప్రభావం.. రెండు రోజుల్లో భారీగా రైళ్ల రద్దు
X

దిశ, వెబ్ డెస్క్: బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం, వాయుగుండం కారణంగా తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు దంచికొట్టాయి. ముఖ్యంగా ఉమ్మడి వరంగల్, ఖమ్మం జిల్లాల్లో ఈ వర్షాల ప్రభావం తీవ్రంగా ఉంది. ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షాల కారణంగా..మహబూబాబాద్ దగ్గర రైల్వే ట్రాక్ పూర్తిగా కొట్టుకు పోయింది. దీంతో అప్రమత్తమైన అధికారులు సమాచారం అందించడంతో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోలేదు. అయితే ఈ కారణంగా ఇవాళ ఉదయం 96 రైళ్లు రద్దు చేశారు. అలాగే నిన్న రాత్రి వరకు మొత్తం 177 రైళ్లను దక్షిణ మధ్య రైల్వే రద్దు చేయగా.. 142 రైళ్లను దారి మళ్లించారు. వరద ఉధృతికి మహబూబాబాద్ దగ్గర దెబ్బతిన్న రైల్వే ట్రాక్ ను యుద్ధప్రాతిపదికన పురుద్దరిస్తున్నారు. కాగా ఈ ట్రాక్ పునరుద్ధరణకు మరో రెండు రోజులు పట్టే అవకాశం ఉందని తెలుస్తుంది. వరదల కారణంగా ఎక్కడి రైళ్లు అక్కడే నిలిచిపోవడంతో.. హైదరాబాద్, విజయవాడ, వరంగల్ లో హెల్ప్ డెస్కులు ఏర్పాటు చేశారు. అలాగే ప్రయాణికులకు భోజన సదుపాయం కూడా కల్పిస్తున్నారు.

Advertisement

Next Story

Most Viewed