వైద్య బదిలీల అవినీతిపై తక్షణమే విచారణ చేపట్టాలి: దామోదర్ రాజనర్సింహ

by Ramesh N |
వైద్య బదిలీల అవినీతిపై తక్షణమే విచారణ చేపట్టాలి: దామోదర్ రాజనర్సింహ
X

దిశ, డైనమిక్ బ్యూరో: సీఎం ఆదేశాల మేరకు హెల్త్ డిపార్ట్‌మెంట్‌పై తాజాగా ఇంటెలిజెన్స్ ఓ ప్రత్యేక రిపోర్టును అందజేసినట్లు సమాచారం. ఇటీవల జరిగిన జనరల్ ట్రాన్స్‌ఫర్లలో భారీస్థాయిలో అవినీతి ఆరోపణలు వచ్చాయి. ఈ క్రమంలోనే వైద్య బదిలీల్లో భారీ అవినీతి జరిగిందని రాష్ట్ర ప్రభుత్వానికి ఇంటెలిజెన్స్ నివేదిక ఇచ్చిందని ‘దిశ’తో సహా వివిధ పత్రికల్లో వార్తలు వచ్చాయి. దీనిపై వైద్య ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖల మంత్రి దామోదర్ రాజనర్సింహ స్పందించారు.

వివిధ పత్రికలలో వచ్చిన వార్త కథనాలపై మంత్రి దామోదర్ రాజనర్సింహ ఆగ్రహం వ్యక్తం చేశారు. వైద్య బదిలీలలో అవినీతికి పాల్పడిన వారిపై తక్షణమే చర్యలు చేపట్టాలని మంత్రి వైద్య, ఆరోగ్య శాఖ ప్రభుత్వ కార్యదర్శిని ఆదేశించారు. 'వైద్య బదిలీలలో భారీ అవినీతి' జరిగిందని పత్రికలో వచ్చిన వార్త కథనాలపై విజిలెన్స్ విచారణ చేపట్టాలని ఆదేశించారు. బదిలీలలో అవకతవకలకు పాల్పడినట్లు విచారణలో తేలితే వారు ఏ స్థాయి వారైనా కఠిన చర్యలు చేపట్టాలని మంత్రి శాఖ కార్యదర్శిని ఆదేశించారు.

Advertisement

Next Story

Most Viewed