TS IMD: రెడ్ జోన్‌లో తెలంగాణ.. రెడ్, ఆరెంజ్ అలర్ట్ ప్రకటన

by srinivas |   ( Updated:2023-07-27 11:34:21.0  )
TS IMD: రెడ్ జోన్‌లో తెలంగాణ.. రెడ్, ఆరెంజ్ అలర్ట్ ప్రకటన
X

దిశ, వెబ్ డెస్క్: వర్షాల నేపథ్యంలో తెలంగాణను ఐఎండీ రెడ్‌జోన్‌గా ప్రకటించింది. అంతేకాదు రాష్ట్రంలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరించింది. నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి జిల్లాల్లో రెడ్ అలర్ట్ ప్రకటించింది. ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, కొత్తగూడెం, ఖమ్మం, నల్లగొండ, సూర్యాపేట, మహబూబ్‌బాద్, వరంగల్, హన్మకొండ, జనగాం, సిద్దపేట, యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి, మేడ్చల్ మల్కాజ్‌గిరి, మహబూబ్‌నగర్ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ ప్రకటించారు.

మరోవైపు రాష్ట్రంలో పలుచోట్ల భారీ వర్షాలు అతలాకుతలం చేస్తున్నాయి. వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. భారీ ప్రాజెక్టులు మొదలుకుని చిన్న చిన్న కుంటల వరకు వర్షపు నీటితో నిండుకులండలా మారాయి. రాష్ట్రంలో ప్రవహిస్తున్న గోదావరి నది ఉధృతంగా ప్రవహిస్తోంది. ఇప్పటికే భద్రాచలం వద్ద గోదావరి నదికి వరద ప్రవాహం పోటెత్తింది. దీంతో ఎప్పటికప్పుడు అధికారులు ప్రమాదక హెచ్చరికలు జారీ చేస్తున్నారు. రాష్ట్రంలోని ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

Advertisement

Next Story

Most Viewed