బ్రేకింగ్: ఎమ్మెల్సీ కవితకు అస్వస్థత

by Satheesh |   ( Updated:2023-11-23 13:05:16.0  )
బ్రేకింగ్: ఎమ్మెల్సీ కవితకు అస్వస్థత
X

దిశ, డైనమిక్ బ్యూరో: ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అస్వస్థతకు గుర్యయ్యారు. ఎన్నికల ప్రచారం సందర్భంగా సృహ తప్పిపడిపోయారు. జగిత్యాల నియోజకవర్గంలో రాయికల్ మండలం ఇటిక్యాలలో బీఆర్ఎస్ అభ్యర్థి సంజయ్ కుమార్‌తో కలిసి రోడ్ షోలో కవిత పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రచార వాహనంలోనే కవిత సృహతప్పి పడిపోయారు. వెంటనే ఆమెకు అక్కడున్న వారు సపర్యలు చేయడంతో కవిత తేరుకున్నారు. అనంతరం ఎన్నికల ప్రచారంలో ప్రసంగించారు. కవిత వరుసగా బీఆర్ఎస్ అభ్యర్థులకు మద్దతుగా ఎన్నికల ప్రచారంలో పాల్గొంటున్నారు. ఈ క్రమంలో ఆమె అస్వస్థతగు గురైననట్లు పార్టీ నేతలు చెబుతున్నారు.

Advertisement

Next Story