- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
హైదరాబాద్ పబ్‌లో చీకటి దందా!
దిశ, డైనమిక్ బ్యూరో: హైదరాబాద్ పబ్‌లు ఇల్లీగల్ యాక్టివిటీస్‌కు అడ్డాలుగా మారుతున్నాయి. తాజాగా జూబ్లీహిల్స్ రోడ్డు నెంబర్ 36లోని ఓ పబ్ కస్టమర్లను ఆకర్షించేందుకు ఏకంగా ‘వైల్డ్ జంగిల్ పార్టీ’ పేరుతో నిర్వహించిన ఈవెంట్ కలకలం రేపుతోంది. విదేశీ వన్యప్రాణులను తీసుకువచ్చి వాటితో కస్టమర్లను ఆకర్షించే ప్రయత్నం సంచలనంగా మారింది. పాములు, తొండలు, పిల్లులు, కుక్కలను బార్‌లో పెట్టి వాటితో కస్టమర్లు ఆడుకునేలా ఏర్పాట్లు చేసింది. నిజానికి ఇటువంటి జంతు ప్రదర్శనపై చట్టప్రకారం నిషేద్ధం ఉన్నప్పటికీ క్లబ్ నిర్వాహకులు మాత్రం అవేమీ మాకు పట్టవు అన్నట్లుగా కస్టమర్ల కోసం జంతువులను అందుబాటులో ఉండటంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
ఈ వన్యప్రాణులకు సంబంధించిన ఫోటోలు, వీడియో క్లిప్పులు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఈ వ్యవహారంపై పలువురు నెటిజన్లు, జంతుప్రేమికులు ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. ఇలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని సోషల్ మీడియాలో నెటిజన్లు కోరుతున్నారు. ఓ నెటిజన్ చేసిన ట్వీట్ పై మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ స్పెషల్ చీఫ్ సెక్రటరీ అర్వింద్ రియాక్ట్ అయ్యారు. ఇది దిగ్భ్రాంతికరమైన ఘటన, ఈ విషయాన్ని తెలంగాణ డీజీపీ, సీపీ ఆనంద్, తెలంగాణ పోలీసులు పీసీసీఎఫ్ దృష్టికి తీసుకు వెళ్తానని చెప్పారు.