- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
నలుగురు నవ్వుకుంటే మాకేంటీ!.. ఆ కూల్చివేతలపై విమర్శలు
దిశ ప్రతినిధి, మేడ్చల్: ‘‘నలుగురు నవ్విపోయినా, పలువురు విమర్శిస్తున్నా.. అవేమి మాకు పట్టవు.. మేము అన్నివేళలా కబ్జాదారుల పట్ల విశ్వాసంగా ఉంట.. జీ హుజూర్’’ అంటూ సహకరిస్తూనే ఉంటామంటూ చెబుతున్నట్లుగా కుత్బుల్లాపూర్ రెవెన్యూ శాఖ అధికారుల తీరు ఉన్నదని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కుత్బుల్లాపూర్ మండలం పేట్ బషీరాబాద్ గ్రామ పరిధి సర్వేనెంబర్ 25/1 రంగారెడ్డి బండలో గత కొన్ని రోజులుగా ప్రభుత్వ భూమిలో అక్రమ నిర్మాణాలు కొనసాగుతున్నాయి. ఈ విషయమై గురువారం దిశ వెబ్ న్యూస్ లో "25/1లో మళ్లీ షురూ అయిన కబ్జాలు" శీర్షికన కథనం ప్రచూరితమైంది. దీనికి సంబంధించిన రెవెన్యూ అధికారులు శుక్రవారం అక్కడి వెలిసిన పలు బేస్ మెంట్లను కూల్చివేసి వెళ్లిపోయారు. అయితే పక్కనే ఉన్న మరొక అక్రమ నిర్మాణాన్ని మాత్రం వదిలిపెట్టడంతో చేసేది లేక కూల్చివేతలకు ఉపక్రమించారు.
అక్రమ నిర్మాణాన్ని చాలా జాగ్రత్తగా..
అయితే ఇక్కడ ప్రభుత్వ భూమిలో నిర్మించిన అక్రమ నిర్మాణాన్ని కూల్చివేసే విషయంలో సిబ్బంది చాలా జాగ్రత్తగా వ్యవహరించి నిర్మాణానికి ఏ మాత్రం ఇబ్బంది లేకుండా కేవలం దానికి ఉన్న ఒక్క కిటికీని మాత్రం తొలగించి మమ అనిపించారు. అక్రమ నిర్మాణాలను కూల్చివేశామంటూ ఫోటోలు దిగి షోప్ టాప్ చేసి వెళ్లిపోయారని అక్కడివారు చెబుతున్నారు. రెవెన్యూ సిబ్బంది వ్యవహరించిన తీరుపై ఓ పక్క వ్యంగ్యంగా నవ్వుకుంటూనే, అధికారుల తీరు పట్ల ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కూల్చివేతలకు ముందు… కూల్చివేతలకు తర్వాత అంటూ పనితీరుపై సోషల్ మీడియాలో అధికారులపైవిమర్శలు గుప్పుమంటున్నాయి.
Read More: బీఆర్ఎస్‌కు మరో గండం.. అధికారులకు సీఎం కేసీఆర్ స్వీట్ వార్నింగ్..!