- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
పొత్తు కుదిరితే.. టికెట్ ఎవరికో? హాట్ టాపిక్‌గా కుత్బుల్లాపూర్ పాలిటిక్స్!
దిశ, పేట్‌బషీర్‌బాగ్/ కుత్బుల్లాపూర్: ఇన్నాళ్లు దూర దూరంగా ఉంటూ వస్తున్న టీడీపీ - బీజేపీల మధ్య పొత్తు అంశం ఇప్పుడు మళ్లీ తెరపైకి వచ్చింది. ఆగస్టు 28న ఢిల్లీలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు జెపి నడ్డాతో భేటీ అయ్యారన్న వార్త ప్రధానంగా వినిపించింది. కొన్నాళ్ల క్రితం అమిత్ షాను కలిసిన చంద్రబాబు తాజాగా జాతీయ అధ్యక్షుడిని కలిసి చర్చలు కొనసాగడంతో బీజేపీ, టీడీపీ మధ్య పొత్తు కోసమే అంటూ విస్తృతంగా ప్రచారం అవుతుంది. తెలంగాణ టీ టీడీపీ అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్ కుత్బుల్లాపూర్ నుంచి పోటీ చేసేందుకు సిద్ధమవుతున్నారంటూ ఇటీవల సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఈ క్రమంలో ఎన్నికల నేపథ్యంలో బీజేపీ, టీడీపీల మధ్య ఒప్పందం కుదిరితే కుత్బుల్లాపూర్ నియోజక వర్గం ఎమ్మెల్యే టికెట్ ఎవరికి వస్తుందనేది ఇప్పుడు ప్రధానమైన అంశం.
పొత్తు కుదిరితే ‘కుత్బుల్లాపూర్’ ఎవరికి..?
సరిగ్గా ఆగస్టు మొదటి వారంలో క్రితం టీటీడీపీ 30 నియోజకవర్గాలకు తాను అభ్యర్థుల ఖరారు చేసినట్లు ఓ లిస్టు సోషల్ మీడియాలో వైరల్ అయింది. దాదాపుగా ఈ లిస్టులో ఉన్న పేర్లు ఖరారు అవుతాయానీ పార్టీకి చెందిన ఓనేత స్పష్టంగా తెలిపారు. ఆ లిస్టు ప్రకారం కుత్బుల్లాపూర్ నియోజక వర్గం నుంచి టీటీడీపీ అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్ ముదిరాజ్ పోటీ చేస్తారని తెలిసింది. తాజాగా చంద్రబాబు సోమవారం ఢిల్లీలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా భేటీ అయి పొత్తులపై చర్చలు జరిపినట్లు వస్తున్న వార్తలతో ఒకవేళ పొత్తు కుదిరితే అనుకున్న విధంగానే టీటీడీపీ అధ్యక్షులు కాసాని కుత్బుల్లాపూర్ నియోజక వర్గం నుంచే బరిలో దిగుతారా? లేదా పొత్తులో భాగంగా బిజెపికే వదిలిపెడతారనేది ప్రశ్న. అదేవిధంగా ప్రస్తుతానికి కుత్బుల్లాపూర్ నియోజకవర్గ బీజేపీ అభ్యర్థిగా కూన శ్రీశైలం గౌడ్ పోటీలో ఉండనున్నారు. పొత్తు కుదిరిన పక్షంలో ఒకవేళ కుత్బుల్లాపూర్ నియోజకవర్గం టీడీపీకి వెళితే ఆయన బరి నుంచి తప్పకుండా అనే మరో ప్రశ్న కూడా ఉన్నది.
గతంలో రెబల్ అభ్యర్థిగా కూన శ్రీశైలం గౌడ్
ఇరు పార్టీల మధ్య పొత్తుకుదిరి కుత్బుల్లాపూర్ నియోజకవర్గం టీడీపీకి వెళ్తే కూన శ్రీశైలం గౌడ్ అందుకు సుముఖంగా ఉంటారా లేదా అనేది సందేహమే. ఎందుకంటే వైయస్ రాజశేఖర్ రెడ్డి కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఉన్న సమయంలో కుత్బుల్లాపూర్ నియోజక వర్గం కాంగ్రెస్ టికెట్ కూన శ్రీశైలం కు కేటాయించకపోవడంతో ఆయన రెబల్ అభ్యర్థిగా బరిలోకి దిగారు. ఆ సమయంలో ఆయన ప్రధాన పార్టీలను తలదన్ని భారీ మెజారిటీతో 53,753 ఓట్లు సాధించి ఇండిపెండెంట్గా గెలిచి తన సత్తా చాటారు. ఈ నేపథ్యంలో పొత్తు అంశంపై కుత్బుల్లాపూర్ నియోజకవర్గం ఎమ్మెల్యే అభ్యర్థిత్వం బీజేపీ - టీడీపీలకు సమస్యగా మారక తప్పదు.
గత ఎన్నికలలో వచ్చిన ఓట్లు
2009 ఎన్నికలలో నియోజకవర్గంలో మొత్తం 3,13,160 ఓట్లు ఉండగా.. వీటిలో 1,57, 578 ఓట్లు పోలయ్యాయి. ఇండిపెండెంట్ అభ్యర్థిగా బరిలోకి దిగిన కూన శ్రీశైలం గౌడ్ 53,750 ఓట్ల రాగా గెలుపొందారు. కాగా, టీడీపీ, టీఆర్ఎస్, కమ్యూ నిస్టు బరిలో నిలిచిన కేపీ వివేకానందకు 30,527 ఓట్లు వచ్చాయి. బీజేపీకి కేవలం 6,624 ఓట్లు వచ్చా యి. 2014 ఎన్నికల్లో నియోజకవర్గంలో 6,01,248 ఓట్లు ఉండగా అప్పుడు భాగస్వాములుగా ఉన్న టీడీపీ, బీజేపీ అభ్యర్థి కేపీ వివేకానందకు 1,14,235 ఓట్లు వచ్చాయి. 2019 అసెంబ్లీ ఎన్నికల్లో మొత్తం 5,16,259 ఓట్లు ఉండగా బీజేపీకి 9,833 ఓట్లు వచ్చాయి. కాగా, టీడీపీ కాంగ్రెస్ పొత్తులో భాగంగా కూన శ్రీశైలం గౌడ్‌కు 1,13,000 ఓట్లు వచ్చాయి.