- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
ఓడినా గుణపాఠం రాకపోతే ఎలా కేటీఆర్ : కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి ఘాటు వ్యాఖ్యలు
దిశ, వెబ్‌డెస్క్ : ఎన్నికల్లో ఓడినా గుణపాఠం రాకపోతే ఎలా కేటీఆర్ అని ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఇవాళ గాంధీభవన్‌లో ఆయన మాట్లడుతూ.. అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలు ఇచ్చిన తీర్పును అంగీకరించే పరిస్థితిలో బీఆర్ఎస్ లేదన సెటైర్లు వేశారు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రచారం తప్ప పనులు చేయలేదని అన్నారు. ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థులను మార్చడం ఈజీయేనని.. ప్రజలు విజ్ఞులు కాబట్టి ముఖ్యమంత్రి కేసీఆర్‌నే మార్చేశారంటూ ఫైర్ అయ్యారు. ఇప్పటికైనా.. కేటీఆర్ గతం నుంచి బయటకు రావాలని లేకపోతే బీఆర్ఎస్ పార్టీకి ప్రతిపక్ష హోదా కూడా దక్కదని ఆరోపించారు.
మిషన్ భగీరథ అతిపెద్ద కుంభకోణమని, కాళేశ్వరం రీ డిజైన్ పేరుతో రూ.కోట్లు తినేశారంటూ ధ్వజమెత్తారు. అదేవిధంగా బీఆర్ఎస్ ప్రభుత్వం ఎస్సీ సబ్ ప్లాన్ ఎస్సీ డెవెలప్‌మెంట్ ఫండ్‌గా మార్చి నిధులను మళ్లించారని ఆరోపించారు. నిధుల దారి మళ్లింపు చర్చకు రాకుండా చేసేందుకు దళిత బంధును తెరమీదరకు తెచ్చారని వెల్లడించారు. గిరిజనులను బీఆర్ఎస్ ప్రభుత్వం నిండా ముంచిందని, అందుకే వాళ్లంతా కాంగ్రెస్‌కు మద్దతు ఇచ్చారని పేర్కొ్న్నారు. ఎస్సీ, బీసీ, మైనారిటీ బంధుల పేరుతో ఎన్నికల ముందు హాడావిడి చేశారని గుర్తు చేశారు.
బీఆర్ఎస్ పరోక్ష మిత్రపక్షంగా భావిస్తున్న బీజేపీ పక్కలో బల్లెంలా కాచుకుని ఉందన్నారు. లోక్‌సభ ఎన్నికల్లో బీఆర్ఎస్‌కు డిపాజిట్లు రావని తెలిపారు. రైతులకు కాంగ్రెస్ ప్రభుత్వం త్వరలోనే తీపి కబురు అందించనున్నట్లు జీవన్‌రెడ్డి పేర్కొన్నారు. రైతు రుణమాఫీకి ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేయబోతోందని అన్నారు. రూ.32 వేల కోట్లతో నిధుల సమీకరణకు కార్యాచరణ మొదలైందని తెలిపారు. ఒక్కో రైతు అసలు, వడ్డీ లెక్కింపు చేస్తోందని పేర్కొన్నారు. రూ.2 లక్షల వరకు రైతుల రుణాలు మాఫీ చేయనున్నట్లు ఆయన వెల్లడించారు.