ఇంటర్ బోర్డ్ కార్యాలయంలోని సీసీ కెమెరాలు ట్యాంపరింగ్: IAS నవీన్ మిట్టల్ కీలక వ్యాఖ్యలు

by Satheesh |   ( Updated:2023-01-30 12:09:55.0  )
ఇంటర్ బోర్డ్ కార్యాలయంలోని సీసీ కెమెరాలు ట్యాంపరింగ్: IAS నవీన్ మిట్టల్ కీలక వ్యాఖ్యలు
X

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ ఇంటర్ బోర్డ్ సెక్రటరీ, సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్ నవీన్ మిట్టల్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇంటర్ బోర్డుకు సమాంతరంగా మరో కమిషనర్ వ్యవస్థ నడుస్తోందని.. ఒక వ్యక్తి వ్యవస్థను పూర్తిగా తన గుప్పిట్లో పెట్టుకున్నారని కీలక వ్యాఖ్యలు చేశారు. బోర్డు కార్యాలయంలోని సీసీ కెమెరాలను ట్యాంపర్ చేశారని.. నేను ఓ అధికారితో మాట్లాడిన విషయాలు మూడో వ్యక్తికి వెంటనే తెలిసిపోతున్నాయని ఆయన ఆరోపించారు.

కరెక్షన్ కోసం రాండమ్‌గా వాల్యుయేటర్లకు పేపర్లు వస్తాయని.. కచ్చితమైన వాల్యుయేషన్ జరుగుతుందని తెలిపారు. విద్యార్థుల సౌలభ్యం కోసమే ఆన్ లైన్ వాల్యువేషన్ ప్రవేశపెడుతున్నామని స్పష్టం చేశారు. మంచి పని చేస్తుంటే సస్పెండైన సదరు వ్యక్తికి నొప్పి ఎందుకని ప్రశ్నించారు. ఎగ్జామినేషన్‌పై అతని కంట్రోల్ పోతుందనే ఇలాంటి ఆరోపణలు చేస్తున్నారని పేర్కొన్నారు. లాంగ్వేజ్‌లు, ఆర్ట్స్, కామర్స్ పేపర్లకు ఆన్ లైన్ వెరిఫికేషన్ ఉంటుందన్నారు. గతంలో ఇంటర్ బోర్డులో కాంట్రాక్ట్ తీసుకుని సరిగా పనిచేయని కంపెనీలకు ఇంటర్ పేపర్ల వాల్యుయేషన్ టెండర్లు ఇవ్వమని.. అంతేకాకుండా గతంలో ఇంటర్ విద్యార్థుల ఆత్మహత్యలకు కారణమైన గ్లోబరీనా కంపెనీకి కూడా ఇవ్వమని నవీన్ మిట్టల్ తేల్చి చెప్పారు.

Advertisement

Next Story

Most Viewed