Motkupalli: నాకు ఎటువంటి పదవులు వద్దు.. కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగుతా: మాజీ మంత్రి మోత్కుపల్లి నర్సింహులు

by Mahesh |
Motkupalli: నాకు ఎటువంటి పదవులు వద్దు.. కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగుతా: మాజీ మంత్రి మోత్కుపల్లి నర్సింహులు
X

దిశ, వెబ్ డెస్క్: దళిత బంధు ప్రకటనతో బీఆర్ఎస్ పార్టీలో చేరిన మోత్కుపల్లి నర్సింహులు.. 2024 అసెంబ్లీ ఎన్నికల ముందు రాజకీయ పరిస్థితులకు అనుగుణంగా కాంగ్రెస్ పార్టీలో చేరారు. అయితే ఆయనకు అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసేందుకు కాంగ్రెస్ పార్టీ అవకాశం కల్పించలేదు. దీంతో గత కొన్ని రోజులుగా పార్టీపై అసహనం వ్యక్తం చేస్తూ.. తీవ్ర స్థాయిలో కాంగ్రెస్ ప్రభుత్వంపై ఫైర్ అయ్యారు. దీంతో ఆయన పార్టీ మారుతున్నారనే ఆరోపణలు కూడా వచ్చాయి. కానీ తాను కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగుతానని మాజీ మంత్రి మోత్కుపల్లి నర్సింహులు క్లారిటీ ఇచ్చారు. సుప్రీంకోర్టు తాజాగా ఇచ్చిన ఎస్సీ రిజర్వేషర్ల వర్గీకరణ తీర్పుపై ఈ రోజు కాంగ్రెస్ పార్టీ మాదిగ ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు, ఉద్యమ నాయకులు మంత్రి దామోదర రాజనర్సింహ అధ్యక్షతన సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి మోత్కుపల్లి నర్సింహులు మాట్లాడుతూ.. నేను కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగుతా.. నాకు ఎటువంటి పదవి అవసరం లేదు. ఎస్సీ వర్గీకరణపై సీఎం రేవంత్‌రెడ్డి మొదట స్పందించారు. ఆయనకు థాంక్స్ చెబుతూ తీర్మానం చేద్దాం. త్వరలో చేపట్టబోయే ఉద్యోగాలలో వర్గీకరణ అమలుకు నిర్ణయం తీసుకున్నందుకు ధన్యవాదాలు తెలుపుదామని మోత్కుపల్లి నర్సింహులు కాంగ్రెస్ మాదిగ ఎమ్మెల్యేలు, నేతల సమావేశంలో చెప్పుకొచ్చారు.

Advertisement

Next Story

Most Viewed