- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
హైదరాబాద్ మనది ‘హైడ్రా’ మనందరిదీ.. గండిపేట పార్క్‌లో హైడ్రా సపోర్ట్ వాక్
దిశ, డైనమిక్ బ్యూరో: హైడ్రా.. (హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్స్ మానిటరింగ్ అండ్ ప్రొటెక్షన్ ) నేడు రెండు తెలుగు రాష్ట్రాల్లో చర్చానీయాంశంగా మారింది. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో అక్రమ కట్టడాలపై తన ఉక్కుపాదం మోపుతోంది. గ్రేటర్ హైదరాబాద్, సికింద్రాబాద్ పరిధిలో చెరువులు, కుంటలను పరిరక్షించడం, వాటిలో వెలిసిన అక్రమ కట్టడాలను కూల్చివేయడానికి ప్రత్యేకంగా హైడ్రా వ్యవస్థను రేవంత్ సర్కార్ తెరమీదకు తీసుకొచ్చింది. దీనికి మూడు వేల మంది సిబ్బందినీ కేటాయించింది. నిన్న ప్రముఖ నటుడు నాగార్జునకు చెందిన ఎన్ కన్వెన్షన్ కూల్చివేయడంతో ప్రభుత్వంపై ప్రశంసలు వస్తున్నాయి.
నగరంలోని గండిపేట్ పార్క్‌లో హైడ్రాకు మద్దతుగా వాక్ నిర్వహించారు. హైడ్రా కు మద్దతుగా గండిపేట వెల్ఫేర్ సొసైటీ ఇవాళ సపోర్ట్ వాక్ నిర్వహించింది. ఈ సపోర్ట్ వాక్‌లో హైడ్రా కమిషనర్ రంగనాథ్‌కు ప్రజలు మద్దతు తెలిపారు. ఈ వాక్‌లో భారీగా స్థానికులు, విద్యార్థులు, యువత, సీనియర్ సిటిజన్స్ పాల్గొన్నారు. ఆక్రమణలకు గురైన గండిపేట చెరువును కాపాడాలని వారు డిమాండ్ చేశారు. హైదరాబాద్ మనది హైడ్రా మనందరిదీ అనే నినాదాలు చేశారు. చెరువులను పరిరక్షించాలని నిర్వాహకులు డిమాండ్ చేస్తున్నారు.