- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
ప్రముఖ టాలీవుడ్ స్టార్ కు చెందిన జయభేరీ సంస్థలకు.. హైడ్రా నోటీసులు!
దిశ, శేరిలింగంపల్లి: హైడ్రా తన దూకుడు కొనసాగిస్తుంది. పండగలు, సెలవు రోజులు అనేవి చూడకుండా ఎఫ్టీఎల్, బఫర్ జోన్ లలో నిర్మాణాల నిర్మూలనే లక్ష్యంగా ముందుకు సాగుతుంది. ఇప్పటికే సినీహీరో నాగార్జునకు చెందిన ఎన్ కన్వెన్షన్ ను కూల్చిన హైడ్రా తాజాగా మరో నటుడు మురళీమోహన్ కు చెందిన జయభేరి సంస్థకు నోటీసులు జారీ చేసింది. గచ్చిబౌలి ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ లోని రంగలాల్ కుంట చెరువు ఎఫ్టీఎల్, బఫర్ జోన్ లో నిర్మించిన నిర్మాణాలను తొలగించాలని జయభేరి నిర్మాణం సంస్థకు హైడ్రా అధికారులు ఆదేశాలు జారీ చేశారు. శుక్రవారం భగీరథమ్మ చెరువును పరిశీలించిన హైడ్రా కమిషనర్ రంగనాథ్ చెరువు ఎఫ్టీఎల్, బఫర్ జోన్ లో ఉన్న నిర్మాణ వ్యర్ధాలను వేయడంపై పూర్తిస్థాయి విచారణ జరపాలని ఆదేశాలు జారీ చేశారు. మరో 15 రోజుల్లో పూర్తిస్థాయి సమావేశాన్ని నిర్వహిస్తామని హైడ్రా కమిషనర్ రంగనాథ్ తెలిపారు.