సీఎం రేవంత్ రెడ్డి సోదరుడు ఉంటున్న ఇంటికి నోటీసులు అంటించిన హైడ్రా

by Mahesh |   ( Updated:2024-08-29 04:23:52.0  )
సీఎం రేవంత్ రెడ్డి సోదరుడు ఉంటున్న ఇంటికి నోటీసులు అంటించిన హైడ్రా
X

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ రాష్ట్రంలో ఎవరి నోట విన్నా హైడ్రా మాటనే వినిపిస్తోంది. కాంగ్రెస్ ప్రభుత్వం ఇటీవల కొత్తగా ఏర్పాటు చేసిన హైడ్రా అక్రమ కట్టడాలపై ఉక్కుపాదం మోపుతున్నది. దీంతో ప్రజలు, రాజకీయ పార్టీల నుంచి హైడ్రాకు మద్దతు లభిస్తోంది. అలాగే ఎటువంటి పక్షపాతం లేకుండా ముందుకు సాగాలని చెరువులు, కుంటలు, నాలాలను కాపాడాలని బహిరంగ డిమాండ్ వినిపిస్తున్నది. ఈ క్రమంలో నగరంలోని అనేక ప్రాంతాల్లో కబ్జాకు గురైన స్థలాలపై కుప్పలు తెప్పలుగా ఫిర్యాదులు వస్తున్న విషయం తెలిసిందే. ఇదిలా ఉంటే ఇప్పటికే నగరంలో కబ్జాలకు పాల్పడిన బడా బాబుల ఆస్తులకు, భవనాలకు హైడ్రా నోటీసులు జారీ చేసింది.

ఇందులో భాగంగా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి సోదరుడు అయిన తిరుపతి రెడ్డి ఇంటికి హైడ్రా నోటీసులు అంటించింది. హైదరాబాద్‌లోని మాదాపూర్‌లోని అమర్ కో-ఆపరేటివ్ సొసైటీలో తిరుపతిరెడ్డి ఓ అద్దె ఇంట్లో ఉంటున్నారు. కాగా ఆ ఇల్లు ఎఫ్‌టీఎల్ పరిధిలో ఉన్నట్లు గుర్తించిన అధికారులు ఈ నోటీసులు ఇచ్చారు. అలాగే దుర్గం చెరువును అనుకుని ఉన్న కావూరి హిల్స్, సెక్టర్స్ కాలనీ, డాక్టర్స్ కాలనీ, అమర్ సొసైటీ వాసులకు కూడా హైడ్రా నోటీసులు జారీ చేసింది. అలాగే నెల రోజుల్లో అక్రమ కట్టడాలు అన్ని కూల్చేయాలని నోటీసుల్లో తెలిపింది.

Advertisement

Next Story