Hydra: ప్రమాదవవాత్తు నాలాలో పడిపోయిన వ్యక్తి.. రక్షించిన హైడ్రా టీం

by Ramesh Goud |
Hydra: ప్రమాదవవాత్తు నాలాలో పడిపోయిన వ్యక్తి.. రక్షించిన హైడ్రా టీం
X

దిశ, డైనమిక్ బ్యూరో: ప్రమాదవశాత్తు నాలలో పడిపోయిన వ్యక్తిని హైడ్రా డీఆర్ఎఫ్ టీం రక్షించింది. ఘటన ప్రకారం బుధవారం తెల్లవారుజామున బానోత్ స్వామి(45) అనే వ్యక్తి అమీర్‌పేటలోని మ్యారిగోల్డ్ హోటల్ సమీపంలోని లీలానగర్ నాలాలో పడిపోయాడు. నాలాలో వ్యక్తి పడిపోవడాన్ని గమణించిన అపార్ట్‌మెంట్ వాసులు పోలీసులకు ఫోన్ చేశారు. దీనిపై సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే హైడ్రా డీఆర్ఎఫ్ టీంకి సమాచారం చేరవేశారు. దీంతో రంగంలోకి దిగిన హైడ్రా డీఆర్ఎఫ్ బృందం ఘటనా స్థలానికి చేరుకొని, నాలాలో పడిపోయిన బానోత్ స్వామిని రక్షించారు. అనంతరం అతడికి పొడి బట్టలు అందించి చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. తదుపరి రక్షణ కోసం వృద్ధాశ్రమంలో చేర్చినట్లు ఖైరతాబాద్ ఎస్ఎఫ్ఓ మోహన్ రావు తెలిపారు.

Advertisement

Next Story