Minister : మారుమూల ప్రాంతమైన నారాయణఖేడ్ కు విద్యాభివృద్ధి కోసం కృషి

by Kalyani |
Minister : మారుమూల ప్రాంతమైన నారాయణఖేడ్ కు విద్యాభివృద్ధి కోసం కృషి
X

దిశ, నారాయణఖేడ్: మారుమూల ప్రాంతమైన నారాయణఖేడ్ నియోజకవర్గ విద్యాభివృద్ధి కోసం కాంగ్రెస్ ప్రభుత్వం కృషి చేస్తోందని ఆరోగ్య, వైద్య శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ అన్నారు. బుధవారం జహీరాబాద్ ఎంపీ సురేష్ కుమార్ షెట్కార్, నారాయణఖేడ్ ఎమ్మెల్యే పట్లోళ్ల డాక్టర్ సంజీవరెడ్డి కలిసి సిర్గాపూర్ మండలం వసర్ గ్రామపంచాయతీ పరిధిలోని వలుతాండ శివారులోని 25 ఎకరాల భూమి లో 150 కోట్లతో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ నిర్మాణం కోసం భూమి పూజ చేశారు. నిజాంపేటలో ఆరోగ్య కేంద్రం నూతన భవనం ప్రారంభోత్సవం రూ.1. 56 కోట్ల ప్రారంభించారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ.. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు ప్రతి నియోజకవర్గ కేంద్రంలో అంతర్జాతీయ ప్రణాలికతో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ ఇంటర్నేషనల్ స్కూల్ ఏర్పాటు చేయడం జరుగుతుందన్నారు. నారాయణఖేడ్ ప్రాంతం గిరిజన జనాభా అధికంగా ఉన్న ప్రాంతం అన్నారు.

గిరిజనులు సంవత్సరంలో ఆరు నెలలు ఉపాధి కోసం ఇతర ప్రాంతాలకు వలస వెళ్తున్నారని అలాంటి వలసల నివారణ కోసం తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేక కృషి చేస్తున్నట్లు తెలిపారు. గిరిజనులకు విద్యాపరంగా, వైద్య పరంగా, ఉపాధి పరంగా మెరుగైన అవకాశాలు కల్పించడం కోసం మారుమూల ప్రాంతంలో విద్య, వైద్య రంగాల్లో అభివృద్ధి కోసం తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేకంగా కృషి చేస్తున్నట్లు తెలిపారు. ప్రతి నియోజకవర్గంలో ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ పాఠశాల ఏర్పాటు చేయడంతో పాటు ప్రతి నియోజకవర్గానికి ఒక నర్సింగ్ కళాశాలను ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. నర్సింగ్ కళాశాల ఏర్పాటు వల్ల గ్రామీణ ప్రాంతాల్లో వైద్య సేవలు మెరుగు పడతాయన్నారు. గ్రామీణ ప్రాంత బాలికలు వైద్య సేవల పట్ల అవగాహన పొంది తమ గ్రామంలో వైద్య సేవలు మెరుగు కోసం కృషి చేస్తామన్నారు. సంగారెడ్డి - అకోలా నాందేడ్ జాతీయ రహదారిపై ప్రతి 30 కిలోమీటర్లకు ట్రామా సెంటర్ ఏర్పాటు చేసి ప్రమాదాల నివారణ కోసం చర్యలు తీసుకుంటామన్నారు.

ప్రమాదాలు జరిగే ప్రాంతాలను గుర్తించి ప్రమాదాలు జరగకుండా అవసరమైన అన్ని రకాల చర్యలు చేపట్టనున్నట్లు తెలిపారు. ఒకవేళ ప్రమాదాలు జరిగిన ప్రాణ నష్టం జరగకుండా హైవేపై అంబులెన్స్ ఏర్పాటు, ట్రామా సెంటర్ ఏర్పాటు చేస్తామన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలు నిర్వహించడం కోసం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వం చిత్తశుద్ధితో పని చేస్తున్నట్లు తెలిపారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీ రెండు లక్షల లోపు రుణమాఫీ చేయడంతో పాటు అన్ని నియోజకవర్గంలో అంతర్జాతీయ స్థాయిలో ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ ఏర్పాటు చేయడం జరుగుతుందన్నారు. వైద్య సౌకర్యాలు మెరుగు కోసం ప్రతి ఆరు నెలలకు ఒకసారి గ్రామంలో ప్రజలకు పూర్తిస్థాయిలో వైద్య పరీక్షలు నిర్వహించడానికి అవసరమైన ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. పేద ప్రజలకు మంచి వైద్యం అందించడం ముఖ్య ఉద్దేశంతోనే నిజాంపేటలో ఆరోగ్య కేంద్రంలో 24 గంటలు అన్ని వసతులతో కూడిన సౌకర్యాలను, అందే విధంగా వైద్య సిబ్బందిని ఏర్పాటు చేస్తామని తెలిపారు. అనంతరం మొక్కలు నాటారు.

ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ..

నియోజకవర్గ పేద విద్యార్థులు ఉన్నతమైన చదువులు చదువుకొని మంచి భవిష్యత్తును ఏర్పాటు చేసుకునే అవకాశం ఉంటుందన్నారు. త్వరలోనే వసర్ గ్రామంలో పీహెచ్సి ని కూడా ఏర్పాటు చేస్తామన్నారు. స్కూల్ నిర్మాణం కోసం 15 కుటుంబాల వరకు 25 ఎకరాల భూమిని ప్రభుత్వానికి ఇవ్వడం గర్వించదగ్గ విషయమని, వారికి ప్రభుత్వం నుంచి పక్కనే అందుబాటులో ఉన్న భూమిని సర్వే చేయించి వారి త్యాగానికి సరైన ఫలితాలనిచ్చే విధంగా కాంగ్రెస్ ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు.

జిల్లా లో నారాయణఖేడ్ కు ప్రాధాన్యత ఇవ్వండి : ఎంపీ, ఎమ్మెల్యే

సంగారెడ్డి జిల్లాలోని అన్ని నియోజకవర్గాలతో పోలిస్తే నారాయణఖేడ్ పూర్తిగా వెనుకబడిందని, ఇక్కడి ప్రాంత ప్రజలకు పరిశ్రమలు లేక వలస వెళ్తున్నారని పరిశ్రమలు ఏర్పాటు చేస్తే ఉపాధి కల్పిస్తుందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టబోయే అన్ని పథకాలకు ముందుగా నారాయణఖేడ్ కు ప్రాధాన్యం ఇవ్వాలని జహిరాబాద్ ఎంపీ సురేష్ షెట్కార్ నారాయణఖేడ్, ఎమ్మెల్యే సంజీవరెడ్డి అన్నారు. మొన్నటికి మొన్న వచ్చిన డీఎస్సీ ఫలితాల్లో నియోజకవర్గంలో 120 మంది టీచర్లుగా ఉద్యోగం సాధించారని నిరుద్యోగులకు ఉద్యోగాలు వచ్చేలా వెను వెంటనే నోటిఫికేషన్లు వేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వానికి, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కి నియోజకవర్గ ప్రజల నుంచి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఉపాధి అవకాశాలు మెరుగుపరచడానికి సంగారెడ్డి కాంగ్రెస్ జిల్లా అధ్యక్షురాలు నిర్మలా జగ్గారెడ్డి ప్రత్యేక చొరవ చూపాలని కోరారు.

ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ వల్లూరు క్రాంతి, జాయింట్ కలెక్టర్ మనోజ్ కుమార్, టి జి ఐఐటీ నిర్మల జగ్గారెడ్డి, ఆర్డిఓ అశోక్ చక్రవర్తి, డీసీసీ ప్రధాన కార్యదర్శి పట్లోళ్ల చంద్రశేఖర్ రెడ్డి, ఉమ్మడి ప్రణాళిక సంఘం మాజీ సభ్యులు నగేష్ షెట్కార్, జిల్లా కాంగ్రెస్ నాయకులు పట్లోళ్ల సుధాకర్ రెడ్డి ,రాష్ట్ర యూత్ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి రాకేష్ షెట్కార్, పీసీసీ సభ్యులు కే. శ్రీనివాస్, కాంగ్రెస్ యువ నేత సాగర్ షెట్కార్, వినోద్ పటేల్, బంజారా సేవాలాల్ సంఘం రాష్ట్ర అధ్యక్షులు కర్ర రమేష్ చౌహన్, మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మనిషా పటేల్, ముదిరాజ్ శంకర్, బండ రెడ్డి, ముంతాజ్, జూలా నాయక్, తదితరులు పాల్గొన్నారు. అనంతరం ఎంపీ, ఎమ్మెల్యే కు, మంత్రి కి ఘన సన్మానం చేశారు.

Advertisement

Next Story

Most Viewed